జాతీయ వార్తలు

శశికళ ఔట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఆగస్టు 28: రోజుకో మలుపుతిరుగుతున్న తమిళ రాజకీయాల్లో సోమవారం మరో కొత్త అంకానికి తెరలేచింది. శశికళ, ఆమె మేనల్లుడిని పార్టీనుంచి బహిష్కరిస్తున్నట్లుగా అన్నాడిఎంకె పార్టీ ప్రకటించింది. సోమవారం జరిగిన పార్టీ అత్యవసర సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. జయలలిత మరణం తర్వాత అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శి హోదాలో శశికళ ఇప్పటివరకు జరిపిన నియామకాలేవీ చెల్లవని ప్రకటించారు. అంతేకాదు జయ టీవీ, నమదు ఎంజిఆర్ పత్రికను పార్టీ అధీనంలోకి తీసుకుంటామని కూడా ప్రకటించింది. జయ పబ్లికేషన్
ఆధ్వర్యంలో నడుస్తున్న నమదు ఎంజిఆర్ పత్రికకు ప్రస్తుతం శశికళ యజమానిగా ఉన్నారు. కాగా జయ టీవీని మ్యాజిక్ డాట్ కామ్ నిర్వహిస్తోంది. శశికళ, దినకరన్‌ల బహిష్కరణను ధ్రువీకరించడం కోసం త్వరలోనే పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కూడా సమావేశంలో తీర్మానించారు.
జయలలిత మరణం తర్వాత చీలిపోయిన ముఖ్యమంత్రి పళనిస్వామి, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గాలు ఏకమవడాన్ని ఆదినుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్న దినకరన్ పార్టీ ఉపప్రధాన కార్యదర్శి హోదాలో పళనిస్వామి సహా పలువురిని పార్టీ పదవులనుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించడం తెలిసిందే. అంతేకాదు తనకు మద్దతు ఇస్తున్న 20 మందికి పైగా ఎమ్మెల్యేలతో పుదుచ్చేరిలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో క్యాంప్ రాజకీయం నిర్వహిస్తున్నారు కూడా. మరో వైపు రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావును కలిసి పళనిస్వామి ప్రభుత్వానికి తమ వర్గం మద్దతు ఇవ్వడం లేదని, ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిందని, అందువల్ల బలపరీక్షకు ఆదేశించాలని కూడా కోరారు. రోజురోజుకు రెచ్చిపోతున్న దినకరన్‌కు చెక్ పెట్టాలని నిర్ణయించుకున్న పార్టీ సోమవారం అత్యవసరంగా సమావేశమై శశికళను, దినకరన్‌ను పార్టీనుంచి తొలగించడం జరిగింది. ‘వారు ఏ నిర్ణయం తీసుకున్నా చెల్లదు. పార్టీ నియమాల ప్రకారం దినకరన్ నియామకం జరగలేదు.. అంతేకాదు, ఎన్నికల కమిషన్ సైతం ఆయన నియామకాన్ని ధ్రువీకరించలేదు’ అని సమావేశం నిర్ణయాలను మీడియాకు తెలియజేసిన పార్టీ ఎంపి ముతుకరప్పన్ తెలిపారు. కాగా, ఈ నెల 10నే దినకరన్‌ను పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి పదవినుంచి తొలగించడం జరిగిందని, అందువల్ల పార్టీ పదవుల్లో ఆయన చేసిన మార్పులేవీ చెల్లవని పార్టీ సమావేశం స్పష్టం చేసింది. దివంగత పార్టీ అధినేఅతి జయలలిత నియమించిన వారిని పార్టీ పదవులనుంచి తొలగించే అధికారం, అర్హత దినకరన్‌కు ఎంతమాత్రం లేదని పేర్కొంటూ సమావేశం ఒక తీర్మానాన్ని ఆమోదించింది.
ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి పళనిస్వామి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నేతలు హాజరయ్యారు. అయితే దినకరన్ వర్గంలోని 20 మందికి పైగా ఎమ్మెల్యేలతో పాటుగా కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా గైరుహాజరయినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. దీనిగురించి పార్టీ నేతలను ప్రశ్నించగా కొంతమంది ఎంపీలు పార్లమెంటు స్థారుూ సంఘాల్లో సభ్యులుగా ఉన్నారని, తమ పనిలో భాగంగా వారు వేరే రాష్ట్రాల్లో ఉండవచ్చని, అందుకే ఈ సమావేవానికి రాలేక పోయారని ఆ వర్గాలు తెలిపాయి. అయితే ఎమ్మెల్యేల్లో దాదాపు అందరూ సమావేశానికి వచ్చారని వారు చెప్పారు.

చిత్రం..అన్నాడిఎంకె ఆఫీసులో నిర్వహించిన పార్టీ అత్యవసర సమావేశంలో పన్నీర్ సెల్వం, పళని స్వామి తదితరులు