జాతీయ వార్తలు

నావిగేషన్ ఉపగ్రహం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, ఆగస్టు 28: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తలపెట్టిన నావిగేషన్ ఉపగ్రహ ప్రయోగానికి శాస్తవ్రేత్తలు సర్వం సిద్ధం చేశారు. ఈ నెల 31న నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేష్ సెంటర్ షార్ కేంద్రం నుండి పిఎస్‌ఎల్‌వి సి39 రాకెట్ ద్వారా ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనున్నారు. ఈ ప్రయోగానికి చెందిన రిహార్సులను సోమవారం విజయవంతంగా నిర్వహించారు. మొబైల్ సర్వీస్ టవర్ నుండి రాకెట్‌ను వెనక్కు తీసుకొచ్చి అందులో పంపించే ప్రక్రియను శాస్తవ్రేత్తలు విజయవంతంగా పూర్తి చేశారు. ఈ ప్రయోగానికి సంబంధించిన మిషన్ రెడీనెష్ రివ్యూ సమావేశం మంగళవారం షార్‌లో జరగనుంది. ఈ సమావేశం అనంతరం లాంచింగ్ ఆథరైజేషన్ బోర్డు సమావేశమై ప్రయోగానికి గ్రీన్ సిగ్నిల్ ఇవ్వనున్నారు. 30వ తేదీ మధ్యాహ్నం 1.59 నిమిషాలకు ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్‌ను ప్రారంభించనున్నారు. 29 గంటలు కౌంట్‌డౌన్ సజావుగా సాగిన అనంతరం పిఎస్‌ఎల్‌వి సి39 రాకెట్ ఈ నెల 31న సాయంత్రం 6.59 గం టలకు షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుండి నింగిలోకి ఎగరనుంది.

చిత్రం..ప్రయోగ వేదిక వద్ద సిద్ధంగా ఉన్న పిఎస్‌ఎల్‌వి సి39 రాకెట్