జాతీయ వార్తలు

కేంద్ర కేబినెట్‌లోకి పవార్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 28: మహారాష్ట్ర రాజకీయ గురువు, ఎన్‌సిపి అధినాయకుడు శరద్ పవార్ కేంద్ర మంత్రివర్గంలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. నరేంద్ర మోదీ సెప్టెంబర్ 3న చైనాలో జరిగే బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి వెళ్లేముందే కేంద్ర మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించనున్నారని బిజెపి వర్గాలు చెబుతున్నాయి. ఎన్‌డిఏలో కొత్తగా చేరిన జెడి(యు)తోపాటు ఎన్‌సిపికి కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించాలని నరేంద్ర మోదీ భావిస్తున్నారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సూచించే ఒకరికి క్యాబినెట్ మంత్రి పదవి, మరో ఇద్దరికి సహాయ మంత్రి పదవులు ఇస్తారని అంటున్నారు. ఎన్‌డిఏకు బైటినుంచి మద్దతు ఇచ్చేందుకు సిద్ధపడిన ఎన్‌సిపి అధినాయకుడు శరద్ పవార్‌కు కేబినెట్ మంత్రి పదవి లభిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. శరద్ పవార్ మొదట తన కూతురు సుప్రియా సూలేను కేంద్ర మంత్రివర్గంలో చేర్చాలనుకున్నారనీ, అయితే నరేంద్ర మోదీ సూచన మేరకు ఇప్పుడు ఆయనే స్వయంగా కేంద్ర మంత్రివర్గంలో ముఖ్యమైన బాధ్యతలు నిర్వహించేందుకు సిద్ధమయ్యాయరని బిజెపి వర్గాలు చెబుతున్నాయి. ఆంధ్రా నుండి ఒక టిడిపి, ఒక బిజెపి నాయకుడికి సహాయ మంత్రి పదవులు లభించే అవకాశాలున్నాయనే మాట వినిపిస్తోంది. లోక్‌సభలో తెలుగుదేశం పక్షం నాయకుడు తోట నరసింహం, బిజెపి ఎంపీ హరిబాబుకు మంత్రివర్గంరో స్థానం లభించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఐదుగురు సహాయ మంత్రులకు పదోన్నతి లభించవచ్చని తెలుస్తోంది. నలుగురు క్యాబినెట్ మంత్రుల శాఖలు మారే అవకాశాలున్నాయి. నరేంద్ర మోదీ గత రెండు రోజుల నుండి బిజెపి అధ్యక్షుడు అమిత్ షాతో మంత్రివర్గం పునర్ వ్యవస్థీకరణం గురించి లోతుగా చర్చలు జరుపుతారని బిజెపి వర్గాలు తెలిపాయి. శరద్ పవార్ కేంద్ర మంత్రివర్గంలో చేరే అవకాశాలు ఉన్నాయని వస్తున్న వార్తలను ఎన్‌సిపి నిర్ద్వద్వంగా తోసిపుచ్చింది. అవి కేవలం ఊహాగానాలు మాత్రమేనని పార్టీ సీనియర్ నేత ప్రఫుల్ పటేల్ అన్నారు.