జాతీయ వార్తలు

ముఝే మాఫ్ కర్ దో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోహ్‌తక్, ఆగస్టు 28: అత్యాచారం కేసులో డేరా సచ్చా సౌదా అధినేత, వివాదాస్పద గురువు గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం 20 ఏళ్ల జైలు శిక్షను విధించగానే గుర్మీత్ సింగ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. జడ్జి శిక్షలను ప్రకటించిన వెంటనే గుర్మీత్ సింగ్ కోర్టు గదిలో ఒక్కసారిగా నేలపై కుప్పకూలిపోయి భోరున విలపిస్తూ‘ ముఝే మాఫ్ కర్ దో’(నన్ను క్షమించండి) అంటూ జడ్జిని వేడుకున్నాడు. అంతేకాదు..తాను నిరపరాధినంటూ కోర్టు గదిలోంచి బైటికి వెళ్లడానికి నిరాకరించాడు. దీంతో పోలీసులు ఆయనను బలవంతంగా బైటికి తీసుకెళ్లాల్సి వచ్చింది. జడ్జి శిక్షలను ప్రకటించిన తర్వాత పోలీసులు ఆయనను వైద్య పరీక్షలకు తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత గుర్మీత్‌కు ఖైదీలకు ఇచ్చే దుస్తులను అధికారులు ఇవ్వనున్నారు. జైలులో సెల్‌ను కూడా కేటాయిస్తారు.