జాతీయ వార్తలు

ఆకాంక్షలకు రెక్కలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 28: తన డ్రీమ్ స్కీం జన్‌ధన్ పథకం ద్వారా లక్షలాది ప్రజల ఆకాంక్షలకు రెక్కలు వచ్చాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. జన్‌ధన్ పథకం ప్రారంభించి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన తన ట్విట్టర్ ఖాతాలో దీనిపై వ్యాఖ్యానించారు. ఈ పథకం సామాజిక సురక్ష పథకాల్లో ఒకటని పేర్కొన్నారు. ముద్రా యోజన, స్టాండప్ ఇండియా కార్యక్రమాలు కూడా ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు తీసుకురావటానికి దోహదపడ్డాయని ఆయన అన్నారు. ‘ఈ రోజు జన్‌ధన్ యోజన మూడేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దీనివల్ల లబ్ధి పొందిన కోట్లాది పేద ప్రజలకు నేను అభినందనలు తెలుపుతున్నా’ అని ఆయన ట్వీట్ చేశారు. ‘దేశంలోని పేద ప్రజలను ప్రధాన ఆర్థిక స్రవంతిలోకి తీసుకురావటంలో జన్‌ధన్ యోజన ఒక విప్లవాత్మక ముందడుగు. దీంతోపాటు ముద్ర, స్టాండప్ ఇండియా ద్వారా ప్రజల ఆకాంక్షలకు రెక్కలు వచ్చేలా చేశాం. దాదాపు 30కోట్ల కొత్త కుటుంబాలు జన్‌ధన్ ఖాతాలు ప్రారంభించాయ. రూ.65వేల కోట్ల రూపాయలు డిపాజిట్ అయ్యాయి’ అని మోదీ వ్యాఖ్యానించారు.
నేడు ఉదయ్‌పూర్‌కు మోదీ
ప్రధాని మోదీ మంగళవారం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ పర్యటించనున్నారు. రూ.15వేల కోట్లతో నిర్మించనున్న జాతీయ రహదారి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేస్తారు. 873 కిలోమీటర్ల మేర పూర్తయిన 11 జాతీయ రహదారి ప్రాజెక్టులను ఆయన దేశానికి అంకితం చేస్తారు.
మోదీతో యుఎన్‌జిఏ అధ్యక్షుడు భేటీ
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడిగా ఎన్నికయిన మిరోస్లావ్ లాజ్‌కాక్ ప్రధాని నరేంద్ర మోదీతో సోమవారం సమావేశమయ్యారు. ఉగ్రవాదంపై ఐక్యరాజ్యసమిగి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మోదీ ఈ సందర్భంగా లాజ్‌కాక్‌తో అన్నారు. 72వ జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు ఆయనను మోదీ అభినందించారు.

చిత్రం..సోమవారం ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయన యుఎన్‌జిఏ అధ్యక్షుడు మిరోస్లావ్ లాజ్‌కాక్