జాతీయ వార్తలు

ఆరు లేన్లుగా 16 ఎన్‌హెచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: ఆంధ్రప్రదేశ్‌లోని నరసన్నపేట నుంచి రణస్థలం వరకు ఉన్న 16వ నెంబర్ జాతీయ రహదారిని ఆరు మార్గాల రహదారిగా అభివృద్ధి చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం జరిగిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం తెలిపింది. నరసన్నపేట- రణస్థలం జాతీయ రహదారిని ఆరు లేన్ల మార్గంగా అభివృద్ధి చేసేందుకు 1,423 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఇందులో భూసేకరణ వ్యయంతోపాటు పునరావాసం, ఇతర ఖర్చులూ ఉన్నాయని కేంద్రం తమ ప్రకటనలో తెలిపింది. మొత్తం యాభై నాలుగు కిలోమీటర్ల రహాదారిని ఆరు లేన్ల రోడ్డుగా అభివృద్ది చేస్తారు. జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ సారథ్యంలో జరిగే ఈ నిర్మాణం పనులను ఐదో దశ హైబ్రీడ్ యాన్యూటీ మోడ్ కింద చేపడతారు. ఈ రోడ్డును అభివృద్ది చేయటం వలన ఏపిఐసిసి, ఎస్‌ఈజడ్, పైడి భీమవరం, భోగాపురం విమానాశ్రం, వైజాగ్ స్టీల్ ప్లాంట్, విశాఖపట్నం పోర్టు, గంగవరం పోర్టు, డివి లాబరేటరీస్, ఐఎన్‌ఎస్ వర్షా, ప్రొజెక్టైల్ ప్రాజెక్టులకు ప్రయోజనం కలుగుతుంది. ప్రస్తుతం ఉన్న నాలుగు లేన్ల రహదారిని ఆరు లేన్ల రహదారిగా అభివృద్ది చేయటం వలన వాహనాల రాకపోకలకు ఎంతో సౌలభ్యం కలుగుతుందన్నారు. రెండు బైపాస్ రోడ్ల నిర్మాణం వలన ఎచ్చెర్ల, రణస్థలం వాహనాల రద్దీ కూడా తగ్గుతుందన్నారు. 29 ఫ్లైఓవర్లు, వియుపి, సియుపిల వలన వాహనాల రాకపోకలు మరింత తేలికవుతుందని కేంద్ర ప్రభుత్వం తమ ప్రకటననలో తెలిపింది. రహదారిపై మూడు లారీల పార్కింగ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తారు. ఈ పార్కుల్లో ఏర్పాటు చేసే సౌకర్యాల మూలంగా లారీ డ్రైవర్లకు ఎంతో మేలు జరుగుతుంది. 54 కిలోమీటర్ల రహాదారిలో దాదాపు 37 కిలోమీటర్ల మేర సర్వీస్ రోడ్లను నిర్మిస్తారు. 43 కిలోమీటర్ల మేరకు స్లిప్ రోడ్లు, 43చోట్ల బస్ బేలను నిర్మిస్తారు. రోడ్డు నిర్మాణం వలన స్థానికంగా రెండు లక్షల ఇరవై ఒక్క వేల పని దినాలు లభిస్తాయి. దీనివలన స్థానిక కార్మికులకు ఉపాధి లభిస్తుందని కేంద్ర ప్రభుత్వం తమ ప్రకటనలో తెలిపింది.