జాతీయ వార్తలు

ముందు.. మహా-గోదావరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబరు 12: దేశంలో మొట్టమొదటిగా ఒడిశా రాష్ట్రంలోని మహానది, గోదావరి నదుల మధ్య అనుసంధానం చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. మంగళవారం విజ్ఞాన్‌భవన్‌లో కేంద్ర జలవనరుల మంత్రి నితిన్ గడ్కారీ ఆధ్వర్యంలో నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ సొసైటీ 31వ వార్షిక సాధారణ సమావేశం జరిగింది. సమావేశానికి తెలంగాణ నీటి పారుదల మంత్రి హరీశ్‌రావు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్‌కె జోషి హాజరయ్యారు. అనంతరం హరీశ్‌రావు విలేఖరులతో మాట్లాడుతూ సమావేశంలో ముఖ్యంగా రాష్ట్రాలమధ్య నదుల అనుసంధానంపై జరిగిన చర్చలో తెలంగాణ నుంచి పలు సూచనలు చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా నీటిపారుదల విషయంలో తెలంగాణ ప్రభుత్వ పనితీరును కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రశంసించారన్నారు. మహానది- గోదావరి నదుల అనుసంధానం ముందుగా చేపట్టాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశామన్నారు. ఇందుకోసం ఒడిశా సిఎం నవీన్ పట్నాయక్‌తో కేంద్రం చర్చించి ఒప్పించేలా చర్యలు చేపట్టాలని కోరినట్టు పేర్కొన్నారు. కేంద్రం చేపట్టాలనుకుంటున్న రెండు, మూడు రాష్ట్రా ల మధ్యనున్న నదుల అనుసంధానంతో పాటుగా ఒక రాష్ట్రంలోని నదుల మధ్యా అనుసంధానం చేపట్టాలని కేంద్రాన్ని కోరామన్నా రు. దీని మూలంగా ఒకే రాష్ట్రంలోని ఒక చోటునుంచి నీటిని మరో ప్రదేశానికి తీసుకెళ్లే లా కేంద్రం సహాకరించాలని విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. ఈ సీజన్‌లో గోదావరి నదిలో పుష్కలంగా నీళ్లుంటే, కృష్ణా నదీ పరీవాహక ప్రాంతమైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో నీళ్లు లేని పరిస్థితి ఉందన్నారు. అందువల్ల ఒకే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారికీ ఉపయోగపడేలా నదుల అనుసంధాన వ్యవస్థపై అన్ని రాష్ట్రాలూ సానుకులంగా ఉన్నాయని హరీశ్‌రావు చెప్పారు. నదుల అనుసంధానంపై రానున్న రోజుల్లో పెద్ద ప్రాజెక్టు చేపట్టనున్నట్టు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్ని రాష్ట్రాలకు తెలియజేశారన్నారు. ఈ ప్రాజెక్టుకు 90 శాతం నిధులను కేంద్రం సమాకురుస్తుందని, మిగిలిన 10 శాతం రాష్ట్రాలు భరించాల్సి ఉంటుందని కేంద్రమంత్రి రాష్ట్రాలకు వివరించినట్టు తెలిపారు.

చిత్రం..ఢిల్లీలో జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మంత్రి హరీశ్‌రావు తదితరులు