జాతీయ వార్తలు

పరువు తీశారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: భారతదేశంలో ప్రతిదీ వారసత్వం మూలంగా పనిచేస్తున్నాయంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను బిజెపి అధికార ప్రతినిధి, సమాచార శాఖ మంత్రి స్మృతి ఇరానీ తీవ్రంగా ఖండించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై రాహుల్ చేసిన విమర్శలను ఆమె గర్హించారు. విదేశాల్లో దేశం పరువు, ప్రతిష్టను కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మంటగలిపారని ఆరోపించారు. అలాగే సోనియా గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ అహంకారపూరితంగా వ్యవహిస్తోందనడానికి రాహుల్ వ్యాఖ్యలే నిదర్శనమని విరుచుకుపడ్డారు. స్మృతి ఇరానీ మంగళవారం బిజెపి కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రధాని మోదీ, రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్టప్రతి ఎం.వెంకయ్యనాయుడు వారసత్వం కిందే ఈ పదవులకు ఎన్నికయ్యారా అంటూ రాహుల్ నిలదీశారు. దేశం వారసత్వం ఆధారంగా పని చేస్తోందని విదేశాల్లో చెప్పడంద్వారా భారత్ పరువు, ప్రతిష్టను దెబ్బతీశారని స్మృతి ఇరానీ దుయ్యబట్టారు. రాష్టప్రతి కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ బడుగు, బలహీన వర్గాల నుంచి కష్టపడి పైకివచ్చి ఉన్నత పదవులను అలంకరించారని ఆమె అన్నారు. ‘ఉపరాష్టప్రతి వెంకయ్యనాయుడు వ్యవసాయ కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆయనకు వారసత్వంగా పదవి వచ్చిందా?’ అని నిలదీశారు. దేశంలో వారసత్వం కాకుండా ప్రతిభతో కూడిన ప్రజాస్వామ్యం పని చేస్తోందని ఆమె చెప్పారు. వారసత్వం, వారసులు భారత దేశ వ్యవస్థకు మూలమని రాహుల్ గాంధీ చెప్పటం పూర్తిగా తప్పిదమని స్పష్టం చేశారు. బిజెపి అధ్యక్షుడు అమిత్ షాకు వారసత్వంగా పదవి రాలేదని అన్నారు. రాహుల్ గాంధీకి ఆత్మ విమర్శ, అంతర్మథనం అంటే ఏమిటో తెలియదని ఆమె చురక వేశారు. అమేథీ అభివృద్ధి గురించి తెలియని రాహుల్ గాంధీ ఆమెరికా వెళ్లి దేశం గురించి మాట్లాడటం విచిత్రంగా ఉన్నదన్నారు. రాహుల్ గాంధీ వాస్తవాల ఆధారంగా మాట్లాడటం నేర్చుకోవాలని సలహా ఇచ్చారు. రాహుల్ గాంధీ దేశానికి సంబంధించిన అంశాలపై తమతో బహిరంగ చర్చకు సిద్దమా? అని స్మృతి ఇరానీ సవాల్ చేశారు. వారసత్వ రాజకీయం చేయటంలో కూడా విఫలమైన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు భారత ప్రజాస్వామ్యాన్ని తప్పుపట్టటం సిగ్గుచేటన్నారు.