జాతీయ వార్తలు

సహించేది లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాంధీనగర్, సెప్టెంబర్ 14: ఉగ్రవాదంపై నిస్సహన వైఖరిని అవలంబించాలని భారత్-జపాన్ నిర్ణయించాయి. తమ వ్యూహాత్మక సంబంధాలను మరింత పటిష్టం చేసుకుంటూ ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సహకారాన్ని పెంపొందించుకోవాలని సంకల్పించాయి. ముఖ్యంగా పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహ్మద్, లష్కరే తొయిబా సహా ఉగ్రవాదాన్ని ఏ రూపంలోనూ సహించేది లేదని ఉద్ఘాటించాయి. ఉగ్రవాదంపై ఉక్కుపిడికిలి బిగించాలని, వీటి స్థావరాలు ఎక్కడున్నా సమూలంగా పెకిలించివేయాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చాయి. అలాగే సరిహద్దుల్లో ఉగ్రవాద కదలికలను కూడా అరికట్టేందుకు గట్టి చర్యలు తీసుకోవాలని గురువారం ఇక్కడ జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని షింజో అబేలు ఉద్ఘాటించారు. 2008 నాటి ముంబయి విఘాతక కృత్యానికి పాల్పడ్డవారిని పట్టుకుని శిక్షించాలంటూ పాకిస్తాన్‌కు నేరుగానే విజ్ఞప్తి చేశారు. అలాగే పఠాన్‌కోట్‌పై దాడికి కుట్రపన్నిన వారిని కూడా శిక్షించి తీరాలని స్పష్టం చేశారు. సమావేశంలో రక్షణ, భద్రత, వాణిజ్యం, పౌర అణు ఇంధన రంగాల్లో ఏ విధంగా సహకారాన్ని పెంపొందించుకోవాలన్నదానిపై ప్రధానంగా దృష్టి సారించారు. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపైనా విస్తృతంగా చర్చించిన ఇరువురు నాయకులు ఇండో-పసిఫిక్ ప్రాంతాన్ని స్వేచ్ఛాయుత శాంతి మండలంగా తీర్చిదిద్దుతామని కృతనిశ్చయంతో ప్రకటించారు. ఇందుకు సంబంధించి విలువల ఆధారిత భాగస్వామ్యాన్ని కొనసాగిస్తామని కూడా తెలిపారు. ముఖ్యంగా అంతర్జాతీయ చట్టాలను గౌరవించడం, ఈ ప్రాంతంలోని దేశాల సార్వభౌమత్వాన్ని పరిరక్షించడం, విభేదాలను చర్చల ద్వారా సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. సంయుక్తంగా జరిగిన విలేఖరుల సమావేశంలో మాట్లాడిన మోదీ భారత్-జపాన్‌ల మధ్య సంబంధాలు కేవలం ప్రాంతీయ, ద్వైపాక్షిక అంశాలకే పరిమితం కాలేదని ప్రత్యేక రీతిలో వ్యూహాత్మక, అంతర్జాతీయ భాగస్వామ్యంపై కూడా దృష్టిపెట్టామని తెలిపారు.

చిత్రం..గాంధీనగర్‌లో గురువారం దండీ కుటీర్‌ను జపాన్ ప్రధాని షింజో అబేకు చూపిస్తున్న నరేంద్ర మోదీ