జాతీయ వార్తలు

రాజీవ్ హత్య కుట్రపై ‘సుప్రీం’కు కేంద్రం నివేదిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: ఇరవై ఆరేళ్ల క్రితం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకు కారణమైన బాంబు తయారీ వెనుక కుట్రకోణంపై జరిపిన దర్యాప్తుపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు శుక్రవారం ఒక నివేదికను సమర్పించింది. న్యాయమూర్తులు రంజన్ గొగోయ్, నవీన్ సిన్హాలతో కూడిన ధర్మాసనం ముందు సీల్డ్ కవర్‌లో ఈ నివేదికను దాఖలు చేశారు. అనంతరం బెంచ్ తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. కాగా, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం తాము నివేదికను దాఖలు చేశామని, అయితే దీన్ని పిటిషనర్‌కు ఇవ్వలేమని అదనపు సొలిసిటర్ జనరల్ మనిందర్ సింగ్ బెంచ్‌కి తెలిపారు. తాము ఈ నివేదికను చూశామని బెంచ్ తెలిపింది. కాగా, తనకు నివేదికను ఇచ్చి తీరాలని తాను ఎప్పుడూ చెప్పలేదని, అయితే కోర్టు అనుమతిస్తే కోర్టులోనే నివేదికను చూస్తానని ఈ కేసులో దోషి ఎజి పేరారివాలన్ తరఫు న్యాయవాది గోపాల్ శంకర్ నారాయణ్ చెప్పారు. దీంతో వచ్చే మంగళవారం ఈ విషయాన్ని విచారిస్తామని బెంచ్ తెలిపింది. రాజీవ్‌గాంధీ మృతికి కారణమైన బాంబు తయారీ వెనుక కుట్ర కోణంపై దర్యాప్తు సక్రమంగా జరపలేదని పేరారివాలన్ వాదించడంతో ఈ అంశంపై జరిపిన దర్యాప్తు వివరాలను తమకు తెలియజేయాలని సుప్రీంకోర్టు గత నెల 17న కేంద్రాన్ని, సిబిఐని ఆదేశించింది. 1991 మే 21వ తేదీ రాత్రి తమిళనాడులోని శ్రీపెరంబదూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో రాజీవ్ గాంధీని ధానుగా గుర్తించిన మహిళా మానవ బాంబు హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ సంఘటనతో ధానుతో పాటుగా మరో 14 మంది కూడా చనిపోయారు.