జాతీయ వార్తలు

రంజిత్ హత్యకేసులో రోజువారీ విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పంచకుల, సెప్టెంబర్ 16: డేరా సచ్చా సౌదా (డిఎస్‌ఎస్) మాజీ మేనేజర్ రంజిత్ సింగ్ హత్య కేసును ఇక్కడి ప్రత్యేక సిబిఐ కోర్టు నేటి నుంచి రోజువారీగా విచారించనుంది. గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ ఈ హత్యతో సంబంధం ఉన్నట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. రంజిత్ సింగ్, జర్నలిస్టు రాంచందర్ ఛత్రపతి హత్య కేసులను ప్రత్యేక సిబిఐ కోర్టు శనివారం విచారించింది. ఇద్దరు మహిళలపై అత్యాచారం జరిపిన కేసులో రోహతక్‌లోని సునారియా జైలులో శిక్ష అనుభవిస్తున్న రామ్ రహీమ్ సింగ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి జగ్‌దీప్ సింగ్ ఎదుట విచారణకు హాజరయ్యాడు. ఈ రెండు హత్య కేసులలోనూ రామ్ రహీమ్ సింగ్ ప్రధాన కుట్రదారుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. ఇదిలా ఉండగా, డిఎస్‌ఎస్ అధినేత మాజీ డ్రైవర్ ఖట్టా సింగ్ కూడా తన వాంగ్మూలాన్ని మళ్లీ నమోదు చేయాలని కోర్టును ఆశ్రయించినట్టు అతని తరపు న్యాయవాది నవకిరణ్ సింగ్ తెలిపారు.