జాతీయ వార్తలు

తృతీయ ఫ్రంట్ వైపు మమత చూపు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 19: పశ్చిమ బెంగాల్‌లో 213 సీట్లను కైవసం చేసుకుని రెండోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టనున్న తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ భావ సారూప్యత గల పార్టీలతో కలిసి జాతీయస్థాయిలో తృతీయ ఫ్రంట్ ఏర్పాటుకు పావులు కదుపుతున్నారు. ముఖ్యమంత్రిగా పశ్చిమ బెంగాల్‌పై దృష్టి కేంద్రీకరిస్తూనే జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించే సూచనలు కనిపిస్తున్నాయి. ‘నేను సగటు మనిషిని. ఇలాగే ఉండాలనుకుంటున్నాను, అయితే మాతృదేశమంటే నాకెంతో ప్రేమ. దేశాభివృద్ధి కోసం ఎంతో కొంత చేయాలి కదా?’ అని ఎన్నికల ఫలితాల అనంతరం మమత వ్యాఖ్యానించారు. అభివృద్ధి సాధించిన భారతదేశాన్ని చూడాలనుకుంటున్నాననే అభిలాషను ఆమె వ్యక్తం చేయటం గమనార్హం. ‘దేశాభివృద్ధి కోసం చేయగలిగినంత చేస్తాను, అది చిన్నదైనా సరే చేసి తీరుతాను’ అని ఆమె స్పష్టం చేశారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే ప్రసక్తి లేదంటూనే, దేశాభివృద్ధి కోసం భావసారూప్యత గల పార్టీలతో కలిసి పనిచేస్తానని ఆమె చెప్పటం గమనార్హం. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ జాతీయ రాజకీయాల్లో తనకు చాలామంది మిత్రులున్నారు, వారందరితో కలిసి పనిచేస్తానని ఆమె ప్రకటించటం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బిహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్, అన్నా డిఎంకె అధ్యక్షురాలు జయలలిత, బిఎస్‌పి అధ్యక్షురాలు మాయావతితో జాతీయ స్థాయిలో కలిసి పనిచేస్తానని ఆమె చెప్పారు. దేశాభివృద్ధి కోసం ఏం చేయాలనేది స్నేహితులందరితో కూర్చోని చర్చిస్తానన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన మంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగుతారా? అనే ప్రశ్నకు బదులిస్తూ తనకు దురాశలేదని ఆమె ప్రకటించారు.