జాతీయ వార్తలు

లాలూకు మళ్లీ సిబిఐ సమన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్‌జెడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు సిబిఐ నుంచి మళ్లీ చుక్కెదురైంది. రెండు ఐఆర్‌సిటిసి హోటళ్ల నిర్వహణను ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించిన వ్యవహారంలో చోటుచేసుకున్న అక్రమాలపై ప్రశ్నించేందుకు లాలూ ఆయన కుమారుడు తేజస్వి యాదవ్‌కు సిబిఐ సమన్లు పంపింది. ఈ నెల 25, 26 తేదీల్లో విచారణకు హాజరుకావాలని వీరిని ఆదేశించింది. ఈ నెల 11, 12 తేదీల్లో కూడా వీరికి సిబిఐ సమన్లు పంపినప్పటికీ లాలూ గైర్హాజరయ్యారు. రాంచీలో జరుగుతున్న ఓ కేసు విచారణకు తాను హాజరుకావాల్సి ఉన్నందున రాలేకపోతున్నానని అప్పట్లో లాలూ వివరణ ఇచ్చారు. అలాగే తేజస్వి యాదవ్ కూడా ముందస్తుగా నిర్ణయించుకున్న రాజకీయ కార్యక్రమాల వల్ల రాలేకపోతున్నానని తెలిపారు. కేంద్రంలో రైల్వేమంత్రిగా పనిచేసినప్పుడు రెండు ఐఆర్‌సిటిసి హోటళ్లను వినయ్, విజయ్ కచ్చార్‌లకు లాలూ అప్పగించారని, అందుకుగాను పాట్నాలో మూడు ఎకరాల బినామీ భూమిని పొందారని సిబిఐ ఆరోపించింది. డిలైట్ మార్కెటింగ్ కంపెనీ ద్వారా ఆ ప్రైవేటు వ్యక్తులకు, లాలూకు మధ్య క్విడ్ ప్రో కో జరిగిందని తెలిపింది. ఇదంతా అవినీతికి, దగాకోరుతనానికి ప్రత్యక్ష నిదర్శనమని పేర్కొంది.