జాతీయ వార్తలు

‘రెండాకుల’ గుర్తుపై 5న ఇసి విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: అన్నాడిఎంకె పార్టీ గుర్తయిన రెండాకులపై తలెత్తిన వివాదంపై ఎన్నికల కమిషన్ అక్టోబర్ 5న విచారణ జరుపుతుంది. రెండాకుల గుర్తు తమకే కేటాయించాలంటూ పార్టీలోని ప్రత్యర్థి వర్గాలయిన పన్నీర్‌సెల్వం, శశికళ వర్గాలు డిమాండ్ చేయడంతో ఇసి ఆరునెలల క్రితం ఈ గుర్తును స్తంభింపజేసిన విషయం తెలిసిందే. ఈ రెండు వర్గాలు తాజాగా తమ వాదనలను సమర్పించడానికి ఇసి ఈ నెల 29 వరకు గడువు ఇచ్చింది. 2016 డిసెంబర్ 5 నాటికి ఉన్న పార్టీ జనరల్ కౌన్సిల్ సభ్యులు, అలాగే కేంద్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుల జాబితాలను సమర్పించాలని ఈ వివాదంతో సంబంధం ఉన్న అన్ని వర్గాలను ఇసి ఆదేశించింది. పార్టీ గుర్తు, పేరును తమకే కేటాయించాలని కోరుతూ పార్టీలోని ఇరువర్గాలు ఇప్పటివరకు 10 లక్షలకు పైగా అఫిడవిట్‌లను దాఖలు చేశాయి. ‘ఇప్పుడు ఇసి ఇరుపక్షాల వాదనలను అక్టోబర్ 5న వింటుంది’ అని ఇసి ప్రతినిధి ఒకరు చెప్పారు. అన్నా డిఎంకె గుర్తుకు సంబంధించిన వివాదంపై అక్టోబర్ 31 లోగా నిర్ణయం తీసుకోవాలని మద్రాసు హైకోర్టు గతవారం ఇసిని ఆదేశించిన విషయం తెలిసిందే.
విలీనం, శశికళ వెలి గురించి ఇసికి చెప్పాం: అన్నాడిఎంకె
పార్టీలోని రెండు వర్గాల విలీనం గురించి, తాత్కాలిక ప్రధాన కార్యదర్శి వికె శశికళను పార్టీనుంచి బహిష్కరించడంతో సహా పార్టీ జనరల్ కౌన్సిల్‌లో చేసిన తీర్మానాల గురించి ఎన్నికల కమిషన్‌కు శుక్రవారం తెలియజేసినట్లు అన్నాడిఎంకె తెలిపింది. అన్నాడిఎంకె ప్రతినిధి బృందం శుక్రవారం ఎన్నికల కమిషన్‌ను కలిసి జనరల్ కౌన్సిల్‌లో చేసిన తీర్మానాలు చెల్లవంటూ శశికళ, ఆమె మేనల్లుడు దినకరన్ నేతృత్వంలోని వర్గం చేసిన వాదనలను తిప్పికొట్టింది. ‘అమ్మ (జయలలిత) వారసత్వాన్ని కాపాడడానికి, పార్టీ కార్యకర్తల మనోభావాలను గౌరవించడం కోసం, సుపరిపాలన కోసం పన్నీర్ సెల్వం, పళనిస్వామి నేతృత్వంలోని రెండు వర్గాలు విలీనమైనట్లు ఇసికి తెలియజేశాం’ అని ఇసితో సమావేశం అనంతరం పార్టీ సీనియర్ నాయకుడు కెపి మునుస్వామి విలేఖరులకు చెప్పారు. అలాగే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవినుంచి శశికళను తప్పిస్తూ, తన మేనల్లుడు దినకరన్‌ను పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా నియమించడం సహా ఆమె జరిపిన అన్ని నియామకాలు చెల్లవంటూ ఈ నెల 12న అన్నాడిఎంకె జనరల్ కౌన్సిల్ సమావేశంలో ఆమోదించిన తీర్మానాల గురించి కూడా పార్టీ ఇసికి తెలియజేసినట్లు చెప్పారు. ‘దివంగత జయలలిత పార్టీకి శాశ్వత ప్రధాన కార్యదర్శి. అలాగే ఎన్నికలు నిర్వహించే వరకు పార్టీ అగ్రనేతలు పన్నీర్ సెల్వం, పళనిస్వామి పార్టీ కోఆర్డినేటర్, జాయింట్ కో ఆర్డినేటర్లుగా ఉంటారు. ఈ మేరకు పార్టీ నిబంధనావళిలో చేసిన మార్పుల గురించి ఇసికి తెలియజేయడం జరిగింది’ అని మునుస్వామి చెప్పారు. మునుస్వామి వెంట ఇసిని కలిసిన వారిలో పార్టీ నేతలు జయకుమార్, ఆర్‌బి ఉదయ కుమార్, సివి షణ్ముగం, మనోజ్ పాండ్యన్, ఎంపి మైత్రేయన్ ఉన్నారు.