జాతీయ వార్తలు

అవి ప్రగతి పట్టని ప్రభుత్వాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వారణాసి, సెప్టెంబర్ 22: గత ప్రభుత్వాలకు అభివృద్ధి అంటే ఇష్టం లేదని, ఎన్నికల్లో విజయం సాధించడం కోసం ప్రభుత్వ ఖజానాను నాశనం చేశాయని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తీవ్రంగా ధ్వజమెత్తారు. తన సొంత పార్లమెంటు నియోజకవర్గమైన వారణాసిలో రెండు రోజుల పర్యటనకోసం శుక్రవారం వచ్చిన ప్రధాని దాదాపు 11 వేల కోట్ల రూపాయల విలువైన అనేక కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయడంతో పాటు పలు వౌలిక సదుపాయల కల్పన ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా సుమారు 300 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ‘దీనదయాళ్ హస్తకళా సంకుల్’ (ఫెసిలిటేషన్ సెంటర్)ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ప్రధాని మాట్లాడుతూ, కేవలం ప్రాజెక్టులను ప్రారంభించడమే కాదు, వాటిని పూర్తి చేస్తాం కూడా’ అని చెప్పారు. అన్ని సమస్యలకు అభివృద్ధే సమాధానమని, పేదల జీవితాల్లో మార్పు తీసుకు రావడం, వారు తమ కాళ్లపై తాము నిలబడేలా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, ఈ తరహా అభివృద్ధినే తాము కోరుకొంటున్నామన్నారు. ఏ పేదవాడు కూడా తమ పిల్లలకు తమ పేదరికాన్ని వారసత్వంగా ఇవ్వాలని కోరుకోడని, పిల్లలకు బంగారు భవిష్యత్తును అందించాలనే కోరుకొంటారని ప్రధాని అంటూ, వారి కలలను సాకారం చేయడానికే తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ‘ఈ దేశంనుంచి పేదరికాన్ని తరిమేయాలనేది మా ప్రభుత్వం కల’ అని మోదీ అన్నారు. మన నేత కార్మికులకు అంతర్జాతీయ మార్కెట్ సదుపాయాలు కావాలని, తద్వారా వారి ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుందని అన్నారు. హస్తకళల కేంద్రంలో గ్రామీణ హస్తకళాకారులు తయారు చేసిన కర్ర, గాజు ఉత్పత్తులను తిలకించిన ప్రధాని కళాకారులతో కొద్ది సేపు ముచ్చటించారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ వౌర్య కూడా పాల్గొన్నారు.
తొలి రోజు పర్యటనలో భాగంగా ప్రధాని మైక్రోఫైనాన్స్ బ్యాంక్ అయిన ఉత్కర్ష్ బ్యాంక్ కార్యకలాపాలను ప్రారంభించారు. అలాగే బ్యాంక్ ప్రధాన కార్యాలయం భవనానికి శంకుస్థాపన చేశారు. అలాగే రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌తో కలిసి వీడియో లింక్ ద్వారా వారణాసిని తన సొంత రాష్టమ్రైన గుజరాత్‌లోని వడోదరా, సూరత్‌లను కలిపే మహామానా ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించారు. అలాగే వారణాసి ప్రజలకోసం జల అంబులెన్స్ సేవను, జల శవవాహన సేవను కూడా ఆయన ప్రారంభించారు. చారిత్రక తులసీ మానస్ ఆలయాన్ని సందర్శించిన మోదీ అక్కడ రామాయణంపై ప్రత్యేక తపాలా బిళ్లను కూడా విడుదల చేశారు.

చిత్రం..వారణాసిలో శుక్రవారం మహామానా ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ. చిత్రంలో యుపి గవర్నర్ రామ్‌నాయక్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ.