జాతీయ వార్తలు

ప్రతీకారానికి వెనుకాడం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: సరిహద్దుల్లో తరచూ కాల్పుల ఉల్లంఘనలతో కవ్వింపులకు దిగుతున్న పాకిస్తాన్‌కు శుక్రవారం భారత్ గట్టి హెచ్చరిక చేసింది. నియంత్రణ రేఖవద్ద అలజడి ధోరణి కట్టిపెట్టకుంటే ప్రతీకార దాడులు జరిపే హక్కును భారత్ ఏ క్షణంలోనైనా వినియోగిస్తుందని తెగేసి చెప్పింది. భారత మిలటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ (డిజిఎంవో) లెఫ్టినెంట్ జనరల్ ఏకె భట్, పాక్ డిజిఎంవో మజ్ జనర్ షహీర్ శంషాద్ మీర్జాతో శుక్రవారం ఫోన్‌లో మాట్లాడుతూ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. పాక్ దళాల దూకుడు సరిహద్దుల్లో శాంతిని దెబ్బతీస్తోంది. అలాంటి కల్లోల చర్యలను ఉపేక్షించే ప్రసక్తే లేదని గట్టిగా హెచ్చరించారు. ‘్భరత సైనిక నైపుణ్యాన్ని తక్కువ అంచనా వేయకండి. సరిహద్దుల్లో పాక్ సైనికుల నుంచి ఏ ఒక్కరికి నష్టం వాటిల్లినా, తదనుగుణంగా ప్రతీకార దాడులు జరిపే హక్కును భారత్ ఏక్షణమైనా వినియోగిస్తుంది’ అని తీవ్రస్వరంతో హెచ్చరించారు. భారత అంతర్గత భద్రతను దెబ్బతీసేందుకు పాక్ చేస్తున్న కుట్రలను ప్రస్తావిస్తూనే, భారత భూభాగంలోకి చొరబాటుదారులను పంపేందుకు పాక్ సైన్యం ఉత్సుకత చూపిస్తోందని గుర్తు చేశారు. ఈ చర్యలను భారత్ చూస్తూ ఊరుకోదని, నియంత్రణ రేఖ వద్ద శాంతి, సామరస్యాన్ని పరిరక్షించాలనే భారత సైనిక దళాల సంకల్పాన్ని దెబ్బతీయొద్దని అని డిజిఎంవో భట్ పునరుద్ఘాటించారు. ఈ విషయంలో భారత్‌కు ప్రతి సహకారం అందించాలని కోరారు. జమ్మూ సెక్టార్‌లోని పాక్ పౌరులను భారత సైనిక దళాలు టార్గెట్ చేస్తున్నాయన్న వాదనతో పాక్ డిజిఎంవో చేసిన ఫోన్‌కు భట్ గట్టిగా బదులిచ్చారు. ‘కవ్వింపు చర్యలన్నీ మీవైపునుంచే కనిపిస్తున్నాయి. వాటికి బదులివ్వడానికే భారత్ దళాలు దిగుతున్నాయి తప్ప, కవ్వింపులకు కాదు’ అని పాక్ డిజిఎంవోకు భట్ గట్టిగా బదులిచ్చారు. ‘సామాన్యులపై భారత్ దళాలు ఎప్పుడూ తుపాకి గురిపెట్టవు. ఆ ముసుగులో భారత్‌లోకి చొరబడాలని ప్రయత్నించే పాక్ ఉగ్రమూకలను ఉపేక్షించవు’ అని అమృత్‌సర్ సరిహద్దులను ఉద్దేశించి భట్ తీవ్రంగా సమాధానమిచ్చారు. జమ్ము కాశ్మీర్ నియంత్రణ రేఖ వద్ద కాల్పుల ఉల్లంఘనలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో, వాటిని భారత్ ఏవిధంగా తిప్పికొడుతుందో ఈ సందర్భంలో భారత డిజిఎంవో పాక్ డిజిఎంవోకు గట్టిగా స్పష్టం చేసినట్టు తెలిసింది.

చిత్రాలు..జమ్మూకు 45 కి.మీ దూరంలోని ఆర్నియా సెక్టార్ సరిహద్దు గ్రామంపై పాక్ సైనికులు
జరిపిన దాడుల్లో గాయపడిన ఓ మహిళను ఆసుపత్రికి తరలిస్తున్న దృశ్యం. ఈ దాడుల్లో
కొన్ని ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయ.