జాతీయ వార్తలు

బిజెపి కార్యాలయంలో సంబరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,మే 19: ఈశాన్య రాష్ట్రం అసోంలో భాజపా భారీ విజయం సాధించడంతో దేశవ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకొన్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికలలో పెద్దగా నమ్మకం పెట్టుకోని బిజెపి అసోంలో విజయం సాధించడంతో ఢిల్లీ అశోక్ రోడ్డులోని పార్టీ కేంద్ర కార్యాలయానికి పెద్దఎత్తున కార్యకర్తలు చేరుకొని మిఠాయిలు పంచుకొని బాణాసంచా కాల్చి, పరస్పరం అభినందనలు తెలుపుకుంటూ నృత్యాలు చేశారు. 2014 సాధారణ ఎన్నికల ముందు జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల నుండి ప్రారంభమైన భాజపా జైత్రయాత్ర ఢిల్లీ, బిహార్ రాష్ట్రాల శాసనసభ ఎన్నికలలో ఓటమి పాలు అవ్వడంతో పార్టీ కేడర్ కొంత నిరుత్సాహానికి గురైంది. అయితే అసోంలో కనీసం ప్రతిపక్షంలో కూడా లేని భాజపా, ప్రస్తుతం అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుండటంతో దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణులు గురువారం సంబరాలలో తేలిపోయాయి. మీగిలిన రాష్ట్రాలలో బెంగాల్, తమిళనాడు,కేరళలో మెరుగైన ఫలితాలు సాధించడం కూడా మంచి పరిణామంగా పార్టీ వర్గాలు అంటున్నాయి.