జాతీయ వార్తలు

ప్రభుత్వం నిద్రపోతోందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: ముంబాయి పేలుళ్ల సూత్రధారి, అంతర్జాతీయ ఉగ్రవాది దావూద్ ఇబ్రహీం భార్య మెహజబీన్ షేక్ గత సంవత్సరం ముంబాయికి దొంగచాటుకు వచ్చిపోవటంపై ఎన్‌డిఏ ప్రభుత్వం వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జేవాలా డిమాండ్ చేశారు. సుర్జేవాలా శనివారం విలేఖరులతో మాట్లాడుతూ పాకిస్తాన్ నుండి ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగిస్తున్న దావూద్ ఇబ్రహీం భార్య దొంగ పాస్‌పోర్టుపై ముంబాయికి వచ్చి అనారోగ్యంతో ఉన్న తన తండ్రిని చూసి వెళితే ఎన్‌డిఏ ప్రభుత్వం నిద్రపోతోందా? అని నిలదీశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దీనిపై దేశ ప్రజలకు వివరణ ఇవ్వాలని సుర్జేవాలా డిమాండ్ చేశారు. దావూద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్ ఇబ్రహీం కస్కర్‌ను పోలీసులు ఇటీవల అరెస్టు చేసి విచారించినప్పుడీ విషయం వెలుగులోకి వచ్చింది. దావూద్ ఇబ్రహీం భార్య మెహజబీన్ షేక్ 2016లో ముంబాయికి వచ్చి తన తండ్రి సలీం కశ్మీరీని కలిసిపోయిందని కస్కర్ పోలీసులకు చెప్పాడు. మెహజబీన్ దొంగ పాస్‌పోర్టును ఉపయోగించి ముంబాయి వస్తే సిబిఐ, రా, ఇతర నిఘా సంస్థలు ఏం చేస్తున్నాయని సుర్జేవాలా ప్రశ్నించారు. దొంగ పాస్‌పోర్టుపై ముంబాయికి వచ్చిన మెహజబీన్‌ను ఎందుకు అరెస్టు చేయలేకపోయారు? దీనికి బాధ్యులైన వారిపై ఎందుకు చర్య తీసుకోలేకపోయారని సుర్జేవాలా ప్రశ్నించారు.

చిత్రం..రణదీప్ సింగ్ సుర్జేవాలా