జాతీయ వార్తలు

ముగిసిన కుంభమేళా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉజ్జయిని, మే 21: నెలరోజుల పాటు సాగిన సింహస్థ కుంభమేళా ఘనంగా ముగిసింది. శనివారం ఆఖరి రోజుకావడంతో తెల్లవారు జామునే సాధువులు, నాగసాధువులు స్నానఘట్టాలకు చేరుకున్నారు. క్షిప్రా నదీ తీరమంతా కిటకిటలాడింది. హరహర మహాదేవ నినాదాలతో దిక్కులు పిక్కటిల్లాయి. ఆఖరి రోజు దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన లక్షలాది మంది భక్తులు ప్రవిత్ర స్నానాలు ఆచరించారని ప్రధాన పురోహితుడు ఈశ్వర్ శర్మ వెల్లడించారు. 12 ఏళ్ల విరామం తరువాత నిర్వహించిన సింహస్థ కుంభమేళ అఖండ విజయం సాధించిందని మధ్యప్రదేశ్ రవాణా మంత్రి, కుంభమేళ ఇన్‌చార్జి భూపేంద్ర సింగ్ స్పష్టం చేశారు. మొత్తం ఏడున్నర కోట్ల మంది మహాకుంభమేళాకు వచ్చినట్టు ఆయన తెలిపారు. ఉజ్జయినిలో క్షిప్రా నదికి వచ్చే దారులన్నీ కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజామున 3 గంటల నుంచే సాధువులు, స్వాములు పుణ్యస్నాలు ఆచరించారు. పది వేల మందికిపైగా విదేశీయులు ఉజ్జయినిని సందర్శించారు. కుంభమేళాలో ఏర్పాట్లు సంతృప్తినిచ్చాయని ప్రెంచ్ మహిళ సోనియా కోస్జుల్ చెప్పారు.