జాతీయ వార్తలు

రాజకీయ హింస వారి నైజం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 8: ‘రాజకీయ హింసాకాండ కమ్యూనిస్టుల నైజం’ అని బిజెపి అధినేత అమిత్ షా తీవ్రంగా విమర్శించారు. కేరళలో బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలపై జరుగుతున్న హత్యాకాండకు నిరసనగా ఈ నెల 3న చేపట్టిన ‘జన రక్షా యాత్ర’లో భాగంగా ఆదివారం ఢిల్లీలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కన్నాట్ ప్లేస్ నుంచి సిపిఎం హెడ్‌క్వార్టర్స్ ఉన్న గోలె మార్కెట్ వరకు దాదాపు 1.5 కి.మీ మేర సాగింది. అనంతరం జరిగిన సభలో అమిత్ షా మాట్లాడుతూ సిపిఎంపై తీవ్ర విమర్శలు చేశారు. వామపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రాజకీయ హింస సర్వసాధారణమైపోయిందని, పశ్చిమ బెంగాల్, త్రిపుర, కేరళలలో జరిగిన దాడులే ఇందుకు నిదర్శమని అన్నారు. కేరళలో వామపక్ష ప్రభుత్వ అధికారంలోకి వచ్చినప్పటినుంచి 120 మంది బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు హత్యకు గురయ్యారని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆరోపించారు. బిజెపి కార్యకర్తలను అత్యంత దారుణంగా హతమారుస్తున్నారని, అంటే అది చూసి తమ కార్యకర్తలు భయపడాలని వారి భావమని, అయితే అలాంటి చర్యలతో తమ పార్టీ మరింత బలపడుతోందని అన్నారు. కేరళలో సిపిఎం అధికారంలోకి వచ్చాక రాజకీయ హింసాకాండ పెచ్చరిల్లుతోందని, ముఖ్యమంత్రి పినరయి జిల్లాలోనే బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని అన్నారు. దేశంలో జరిగే ప్రతి చిన్న విషయాన్ని బూతద్దంతో చూసే మానవ హక్కుల సంఘం నేతలు కేరళలో జరుగుతున్న హత్యాకాండపై పెదవి విప్పడం లేదని అన్నారు. ప్రపంచంలో కమ్యూనిస్టు పార్టీలన్నీ కనుమరుగై పోతున్నాయని, అలాగే ఇండియాలో కాంగ్రెస్ కూడా కనుమరుగు కావడం ఖాయమని అన్నారు. కేవలం పది మందితో ప్రారంభమైన బిజెపికి ఇప్పుడు 11 కోట్ల మంది కార్యకర్తలున్నారని తెలిపారు. అక్టోబర్ 3న కేరళలోని కన్నూర్ జిల్లాలో ప్రారంభమైన ‘జన రక్షా యాత్ర’ ఈ నెల 17న తిరువనంతపురంలో ముగుస్తుంది.
వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే: ఏచూరి
కేరళలో రాజకీయ హింసను ప్రారంభించింది బిజెపియేననిని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మండిపడ్డారు. ఢిల్లీలో ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ బిజెపి తలపెట్టిన జన రక్ష యాత్ర కేరళ, ఢిల్లీలో విఫలమైందని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మూడేళ్ల పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు జన రక్ష యాత్రలు పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. కేరళలో రాజకీయ హింసను తగ్గించడానికి సిపిఎం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుంటే బిజెపి వాటికి సహకరించకుండా హింసను ప్రేరేపిస్తోందని అన్నారు. కేరళలో ఎన్నికల ఫలితాలు వస్తున్నప్పుడే బిజెపి కార్యకర్తలు బాంబులు వేసి సిపిఎం కార్యకర్తలపై దాడులు చేసారని ఆయన దుయ్యబట్టారు.

చిత్రం..కేరళలో హత్యకు గురైన బిజెపి కార్యకర్తలకు నివాళులర్పిస్తున్న అమిత్ షా