జాతీయ వార్తలు

రాయబారులు, ఎస్‌పిజిలకు డ్రెస్ అలవెన్స్ పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 9: దౌత్యవేత్తలు, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్‌పిజి) అధికారులు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వద్ద భద్రతా ఏర్పాట్లు చూసే అధికారులు, మాజీ ప్రధానులు, వారి కుటుంబ సభ్యుల వద్ద భద్రతా అధికారుల డ్రెస్ అలవెన్స్ పెంచారు. ఏడో కేంద్ర వేతన సంఘం కమిషన్ సిఫార్సు మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆపరేషనల్ డ్యూటీల్లో ఉన్న ఎస్‌పిజి అధికారులకు ఏడాదికి 27,800 రూపాయల డ్రెస్ అలవెన్స్ ఇస్తారు. ఆలాగే నాన్ ఆపరేషనల్ విధుల్లో ఉండే వారికి 21,225 రూపాయలకు పెంచారు. ఈ మేరకు అధికారి ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్యానెల్ సిఫార్సుల ఆమోదానికి ముందు ఎస్‌పిజి అధికారుల ఏడాదికి తొమ్మిదివేల రూపాయల అలవెనే్స వచ్చేది. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు గార్డులు ప్రధాని మోదీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె పిల్లలు ప్రియాంక, రాహుల్ తదితర ప్రముఖుల వద్ద విధుల్లో ఉంటారు. వారందరికీ డ్రెస్ అలవెన్స్ పెంచాలని ఏడో వేతన సంఘం సిఫార్సు చేసింది.
ఆర్థిక శాఖ కార్యదర్శి అశోక్ లావాస నేతృత్వంలోని కమిటీ అలవెన్సులు పెంచాలన్న వేతన సంఘం ప్రతిపాదనలు పరిశీలించిన మీదట ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. కేంద్ర ప్రభుత్వంలో పనిచేసే అధికారులకు అందుతున్న 196 రకాల అలవెన్సులకు సంబంధించి ఏడో వేతన సంఘం అధ్యయనం చేసి కొన్ని ప్రతిపాదనలు చేసింది. ఐఎఎఫ్ అధికారులకు అవుట్‌ఫిట్ అలవెన్సులు ప్రతిపాదిస్తూ మిగతా ప్రభుత్వ అధికారులకు 50శాతం పెంచాలని ప్యానెల్ సూచించింది.