జాతీయ వార్తలు

భవిష్యత్తూ కీలకమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 10: రోడ్డు ప్రమాదాల్లో నష్టపరిహారాలకు సంబంధించి సుప్రీంకోర్టు కీలకమైన నిర్ణయం తీసుకుంది. ప్రమాదంలో మరణించిన వ్యక్తి ‘్భవిష్యత్తు’ ఎదుగుదల అవకాశాలను కూడా దృష్టిలో పెట్టుకుని నష్టపరిహారానికి సంబంధించి మార్గదర్శకాలను రూపొందిస్తామని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ బెంచ్ మంగళవారం ప్రకటించింది. మృతుడి భవిష్యత్తు అవసరాలు అన్న అంశాన్ని కూడా నష్టపరిహారాన్ని నిర్ణయించే సమయంలో దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా సారథ్యంలోని రాజ్యాంగ బెంచ్ స్పష్టం చేసింది. నష్టపరిహారానికి సంబంధించి మొత్తం 27 పిటిషన్లను పరిశీలించిన సుప్రీం ధర్మాసనం వాటిపై తన తీర్పును వాయిదా వేసింది. చాలా ప్రమాద కేసుల్లో బాధిత కుటుంబాలు దిక్కూమొక్కూ లేని పరిస్థితుల్లో పడిపోతాయని, అలాంటి వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతోనే ఈ అంశాన్ని కూడా నష్టపరిహార మొత్తంలో చేర్చాలని తెలిపింది. ఇందుకు సంబంధించి అనేక ఉదాహరణలను సుప్రీంకోర్టు బెంచ్ ఉటంకిస్తూ ఏ వృత్తిలో ఉన్నవారికైనా ఈ రకమైన పరిస్థితి తలెత్తుతుందని, వారు చార్టెడ్ అకౌంటెంట్లయినా, డాక్టర్లయినా భవిష్యత్తు అంచనా ఎంతైనా అవసరమని తెలిపింది. అందుకే ఈ అంశం కింద కనీస మొత్తాన్ని బాధిత కుటుంబానికి చెల్లించడం వల్ల ఆ కుటుంబాన్ని మరో రకంగా కూడా ఆదుకున్నట్లు అవుతుందని తెలిపింది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని మోటారు వాహనాల చట్టం కింద చెల్లించే నష్టపరిహారాన్ని నిర్ధారించాల్సిన అవసరం ఉందని వెల్లడించింది. ప్రమాదంలో మరణించే వ్యక్తులు భవిష్యత్తులో తమ తమ వృత్తుల్లో ఏవిధంగా ఎదిగే అవకాశముందన్న అంశం కూడా ఈ పరిహారం చెల్లించడంలో కీలకం కావాలని, ఆ వ్యక్తి ఉద్యోగం లేదా వ్యాపారంలో ఎదిగే అవకాశాలను, ఆయుష్షు పరిమాణాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవడం అవసరమని తెలిపింది. లాయర్ల విషయానికొస్తే 50 నుంచి 70 ఏళ్ల మధ్య కాలంలో వృత్తిపరంగా వాళ్లు ఎదిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, అదే సొంత వ్యాపారం లేదా ప్రైవేటు రంగంలో పనిచేసే వ్యక్తి మరణిస్తే అతడి భవిష్యత్తు అవకాశాలను పరిగణనలోకి తీసుకోకుండా ఉండటానికి వీల్లేదని తెలిపింది. అందుకే ఈ అంశానికి సంబంధించి ప్రైవేటు రంగంలో ఉన్నా లేదా సొంతంగా వృత్తి వ్యాపారాల్లో ఉన్న వ్యక్తులు మరణిస్తే కొంత మొత్తాన్ని చెల్లించాలని స్పష్టం చేసింది.