జాతీయ వార్తలు

కాలుష్యం తగ్గుతుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 10: దేశ రాజధాని ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్‌సిఆర్)లో దీపావళి బాణసంచా నిషేధిస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అయితే కాలుష్యం బారినపడ్డ ఢిల్లీ పరిసరాలకు ఈ చర్య ఇప్పటికిప్పుడు ఊరట కలిగించకపోయినా భవిష్యత్‌లో మంచి ఫలితాలే ఉంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దట్టమైన కాలుష్య మేఘాలు, వాయు కాలుష్యంతో సతమతమవుతున్న పౌరులకు సుప్రీం కోర్టు తీర్పు ఉపశమనమేనని పలువురు స్పష్టం చేశారు. ఢిల్లీ-ఎన్‌సిఆర్ పరిధిలో ఈ నెల 31 వరకూ బాణసంచాపై సుప్రీం కోర్టు నిషేధం విధించింది. ‘సర్వోన్నత న్యాయస్థానం తీర్పును ఢిల్లీ వాసులు గౌరవించాలి. గ్రీన్ దీపావళిని ఇద్దాం.. పర్యావరణ పరిరక్షణకు మన వంతు సహకారం అందిద్దాం’ అని మంత్రి హర్షవర్ధన్ స్పష్టం చేశారు.

చిత్రం..ఢిల్లీలో బాణసంచా అమ్మకాలను నిషేధిస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో
ఆందోళన చేస్తున్న వ్యాపారులు