జాతీయ వార్తలు

అమేథీకి చేసిందేమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమేథీ, అక్టోబర్ 10: కుటుంబ కంచుకోటగా మారిన అమేథీ లోక్‌సభ నియోజక వర్గం అభివృద్ధికి నెహ్రూ-గాంధీ కుటుంబీకులు చేసిన కృషి ఏమిటని బిజెపి అధినేత అమిత్ షా ప్రశ్నించారు. మూడు తరాలుగా నెహ్రూ కుటుంబం ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తోందని పేర్కొన్న ఆయన గుజరాత్ అభివృద్ధి నమూనాను కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించడాన్ని తప్పుబట్టారు. ఇటలీ కళ్లజోడు పెట్టుకున్న రాహుల్ గాంధీకి అభివృద్ధి కనిపించదంటూ మంగళవారం ఇక్కడ జరిగిన ఓ బహిరంగ సభలో అమిత్ షా అన్నారు. కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తదితరులు ఈ సభలో పాల్గొన్నారు. అమేథీ సహా మొత్తం యూపీని అభివృద్ధి చేయడానికి ప్రధాని మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కృషి చేస్తున్నారని పేర్కొన్న అమిత్ షా ‘అరవై ఏళ్లపాటు ఒకే కుటుంబాన్ని నమ్మారు. ఇప్పుడు మీరు మోది, బిజెపిని నమ్మండి. ఎలాంటి అన్యాయం జరుగదు’ అని నియోజకవర్గ ప్రజలనుద్దేశించి అన్నారు. దేశంలో రెండే అభివృద్ధి విధానాలున్నాయని, ఒకటి నెహ్రూ-గాంధీ తరహా అభివృద్ధి అయితే రెండోది మోదీ అభివృద్ధి నమూనా అని షా వివరించారు. బిజెపి తన పాలనలో ఏమీ చేసిందంటూ రాహుల్ వేసిన ప్రశ్నలకు జవాబిచ్చిన అమిత్ షా ‘దేశాన్ని 70ఏళ్ల పాటు కాంగ్రెస్ పాలించింది. మీరూ కొనే్నళ్లుగా ఈ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇక్కడ కలెక్టర్ కార్యాలయం ఎందుకు లేదు. ఆకాశవాణి కేంద్రం ఎందుకు లేదు.. టిబీ ఆసుపత్రికి కూడా ఇక్కడ దిక్కులేదు’ అని అన్నారు. కాగా, కేవలం ఓట్ల దృష్టితోనే అమేథిని పరిశీలించారంటూ రాహల్‌పై కేంద్ర మంత్రి స్మృతి ఇరాని ధ్వజమెత్తారు. రైతుల సంక్షేమం గురించి మాట్లాడుతున్న రాహుల్ వారి నుంచి రాజీవ్ ఫౌండేషన్ కోసం సేకరించిన భూముల్ని ఎందుకు తిరిగి ఇవ్వలేదని ప్రశ్నించారు.

చిత్రం..అమేథీలో మంగళవారం నిర్వహించిన బహిరంగ సభలో వేదికపై యుపి ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ