జాతీయ వార్తలు

యోగ.. సాధక ప్రక్రియ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 11: యోగ ఒక సాధక ప్రక్రియ మాత్రమే. పురాతన శాస్త్రాలను ఆపాదిస్తూ మతసంబంధ అర్థాలను ప్రచారం చేయడం వల్ల మానవాళికి తీరని నష్టం వాటిల్లుతుంది అని ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు సూచించారు. యోగ ప్రక్రియపై మరిన్ని పరిశోధనలు జరగాలని ఆయనచెప్పారు. అనేక వైద్య విధానాల మాదిరిగానే యోగ కూడా ఒకతరహా ప్రాచీన వైద్య విధాన సాధక ప్రక్రియే. కొన్ని రకాల రుగ్మతలను ఎదుర్కోవడంలో శాస్ర్తియ ఫలితాలు ఇవ్వగలిగేది యోగ ఒక్కటే అని ఆయన అన్నారు. ఢిల్లీలో మంగళవారం రెండు రోజుల అంతర్జాతీయ యోగా సదస్సును ఉప రాష్టప్రతి వెంకయ్య నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మానసిక, శారీరక పటుత్వానికి మనిషి అనుసరించే అనేక కసరత్తులకు యోగా తల్లివంటిదని అన్నారు. దీనివల్ల అనవసరమైన వైద్య ఖర్చులూ తగ్గుతాయని సూచించారు. మన పూర్వీకులు జ్ఞానులు. వాళ్లు సూచించిన ప్రతి క్రియలోనూ లోతైన, నిగూఢమైన సంపద ఉంది. మానవాళి సంక్షేమానికి అనుసరణీయమైన క్రియా విధానముంది. అలాంటి వాటిలో యోగ క్రియ ముఖ్యం’ అని వెంకయ్య వివరించారు. ‘యోగ గురు రామ్‌దేవ్ ప్రతి గడపకూ యోగాను తీసుకెళ్తున్నారు. ప్రతి ఒక్కరూ ఆనందంగా జీవించడానికి యోగ ఎలా ఉపకరిస్తుందో వివరిస్తున్నారు. అనితరసాధ్యమైన కార్యాచరణను నిర్వహిస్తున్న ఆయనను అభినందించాలి’ అని వెంకయ్య ప్రశంసించారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ యోగ అంశాన్ని సీరియస్‌గా తీసుకుని, ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తే, ఆరోగ్యంపై కేంద్రం వెచ్చిస్తున్న ఖర్చు తగ్గిపోతుందని ఉప రాష్టప్రతి అన్నారు. ఒక మనిషి తనను తాను తెలుసుకోవడానికి, శోధించడానికి యోగ క్రియ ఎంతో ఉపకరిస్తుందని, మానవాళి మొత్తం దీన్ని అనుసరిస్తే ఆనందకరమైన సమాజం ఆవిష్కృతమవుతుందని ఉప రాష్టప్రతి వెంకయ్య నాయుడు చెప్పారు.

చిత్రం..ఢిల్లీలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా సదస్సులో ఉప రాష్టప్రతి వెంకయ్య తదితరులు