జాతీయ వార్తలు

జస్టిస్ నారిమన్‌కు హక్కుల హీరో అవార్డు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 10: గోప్యత అన్నది ప్రాథమిక హక్కు కిందకే వస్తుందన్న చారిత్రాత్మక తీర్పు వెలువడంలో కీలకపాత్ర పోషించిన సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఆర్‌ఎఫ్ నారిమన్‌కు అరుదైన గౌరవం లభించింది. గోప్యతపై తీర్పునిచ్చిన రాజ్యాంగ ధర్మాసనంలో నారిమన్ సభ్యుడిగా ఉన్నారు. ఆయన వెలిబుచ్చిన విలువైన సూచనలు, సలహాలను గుర్తించి గ్లోబల్ డిజిటల్ రైట్స్ అడ్వొకెసీ గ్రూపు ‘హీరో’ అవార్డుకు ఎంపిక చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఎంపిక చేసిన ఐదుగురు న్యాయకోవిదుల్లో నారిమన్ ఒకరు. ‘హీరోస్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అండ్ కమ్యూనికేషన్ సర్వెయిలెన్స్’కు ఆయన పేరును ప్రతిపాదించారు. వ్యక్తిగత గోప్యతపై విచారించిన తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనంలో నారిమన్ సభ్యుడిగా పనిచేశారు. అంతర్జాతీయ విలువలు, మానవ హక్కులు, హక్కులపై వెలువడిన పలు తీర్పులు క్రోడీకరించి బెంచ్‌కు ఆయన సూచనలు చేశారని గ్రూప్ వెల్లడించింది. గోప్యతపై నారిమన్ చేసిన సూచనలు పరిగణనలోకి తీసుకున్న 9 మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం గోప్యత ప్రాథమిక హక్కు కిందకే వస్తుందని చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. తొమ్మిది మందితో కూడిన రాజ్యాంగ బెంచ్‌లో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జెఎస్ ఖెహార్, న్యాయమూర్తులు ఎస్‌ఏ బోగ్డే, జె చలమేశ్వర్, ఆర్‌కె అగర్వాల్, ఎఎం సప్రే,డివై చంద్రచూడ్, ఎస్‌కె కౌల్, ఎస్ అబ్దుల్ నజీర్ ఉన్నారు. నారిమన్ అభిప్రాయాలకు రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవ ఆమోదం తెలపడం గమనార్హం. ఆగస్టు 24న సుప్రీం కోర్టు గోప్యత అన్నది ప్రాథనిక హక్కు కిందకే వస్తుందని తీర్పును వెలువరించింది. మానవ హక్కుల కోసం కృషి చేస్తూ వాటి పరిరక్షణకు పాటుపడుతున్న ప్రముఖ వ్యక్తులను ‘హీరో’గా డిజిటల్ అడ్వొకెసీ గ్రూప్ ఎంపిక చేసి అవార్డులు ప్రదానం చేస్తుంది. అలాగే మానవ హక్కులను కాలరాసే వారిని ‘విలన్లు’గా ఎంపిక చేయడం జరుగుతోంది. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌లతో పాటు ఐదుగురిని ఈ ఏడాది ‘విలన్లు’గా ఎంపిక చేసింది. ట్రంప్ పాలనలో అమెరికాలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని గ్రూప్ ఆరోపిస్తోంది. సంస్కరణల పేరుతో ట్రావెల్ ఆంక్షలు, ఇమ్మిగ్రేషన్ నిబంధనల్లో మార్పులు చేసి ట్రంప్ చట్టాలను ఉల్లంఘించారని డిజిటల్ గ్రూప్ పేర్కొంది.