జాతీయ వార్తలు

‘బేటీ బచావో’ కాదు.. ‘బేటా బచావో’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 10: అమిత్ షా కుమారుడు జయ్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విట్టర్‌లో విమర్శల పరంపర కొనసాగిస్తూనే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకం ‘బేటీ బచావో’ కాస్తా ‘బేటా బచావో’గా రూపాంతరం చెందిందని, ఆ విధంగా అమిత్ షా కుమారుని వ్యాపారం ఎన్నో రెట్లు పెరిగిపోయిందని ఎద్దేవా చేశారు. జయ్‌ను వెనకేసుకొస్తున్న కేంద్ర మంత్రులను ఆయన వదల లేదు. సోమవారంనాడు మోదీని ఉద్దేశించి ‘నోరు విప్పండి.. లేదా జయ్ వ్యాపారంలో మీకు భాగముందా’ అని నిలదీసిన విషయం తెలిసిందే. ఇదే విషయమై మంగళవారం దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించారు. జయ్ వ్యవహారాన్ని నిగ్గు తేల్చాలని, అమిత్ షాను బిజెపి చీఫ్ పదవి నుంచి తప్పించాలని, సుప్రీం కోర్టు న్యాయమూర్తిచే దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.
ఆర్‌ఎస్‌ఎస్‌లో మహిళా కార్యకర్తలేరీ?
వదోదర: ఆర్‌ఎస్‌ఎస్, బిజెపిలో మహిళా కార్యకర్తలు ఎంతమంది ఉన్నారని, సంఘ్ నిర్వహించే శిబిరాల్లో ఎంతమంది మహిళలు పాల్గొంటున్నారని రాహుల్ నిలదీశారు. నిక్కర్లు వేసుకునే వాళ్లలో ఎప్పుడైనా మహిళలను చూశారా అని ఆయన ప్రశ్నించారు. గుజరాత్ పర్యటనలో ఉన్న రాహుల్ మంగళవారం ఇక్కడ కొంతమంది విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ‘మహిళలు నోరు మెదపనంతకాలం వాళ్లు మంచోళ్లు.. నోరు విప్పితే వాళ్ల నోళ్లు మూయిస్తారు’ అంటూ బిజెపిపై తీవ్ర విమర్శలు చేశారు. అదే కాంగ్రెస్ పార్టీలో ప్రతిదాంట్లో మహిళకు ప్రముఖ స్థానం కేటాయిస్తున్నామని అన్నారు. గుజరాత్‌లో అధికారం అప్పగిస్తే మహిళలకు ప్రాధాన్యత కల్పిస్తామని అన్నారు. గుజరాత్‌లో ‘నవసార్జన్ యాత్ర’ పేరుతో రాహుల్ రెండు రోజులుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.

చిత్రాలు..వదోదరలో మంగళవారం కాంగ్రెస్ నిర్వహించిన ర్యాలీలో మాట్లాడుతున్న రాహుల్
*బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు వ్యతిరేకంగా మంగళవారం ఢిల్లీలోని బిజెపి కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న యువజన కాంగ్రెస్ కార్యకర్తలు