జాతీయ వార్తలు

లోపాలను సరిదిద్దుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 10: భారత వైమానిక దళాన్ని సర్వసన్నద్ధం చేస్తామని, సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల తలెత్తిన లోపాలను తొలగిస్తామని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఐఏఎఫ్ కమాండర్ల ద్వైవార్షిక సమావేశాన్ని ఉద్దేశించి మంగళవారం నాడిక్కడ మాట్లాడిన సీతారామన్ ‘వివిధ దళాలను పూర్తి సామర్థ్యంతో ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అందుకు సంబంధించి త్రివిధ దళ కమాండర్లు తమకున్న అధికారాలను అదే స్థాయిలో వినియోగించుకోవాలి. తమతమ దళాలను సర్వసన్నద్ధం చేయాలి’ అని తెలిపారు. గత దశాబ్దకాలంగా వైమానిక దళాల అవసరాలను తీర్చడంలో సరైన నిర్ణయమే తీసుకోవడం జరగలేదని, ఇప్పుడు తమ ప్రభుత్వం ఈ లోపాలను తొలగించి ఈ దళాన్ని శక్తివంతంగా మారుస్తుందని పేర్కొన్నారు. భారత్ - చైనా సరిహద్దులోని కొన్ని ప్రాంతాల్లో చైనా దూకుడుగా వ్యవహరించడంతోపాటు ప్రాంతీయ భద్రతా పరంగా ఎదురవుతున్న సవాళ్లను దృష్టిలో పెట్టుకుని మూడు రోజుల ఐఏఎఫ్ కమాండర్ల సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఐఏఎఫ్ తన సామర్థ్యాన్ని పెంచుకునే విషయంలో నిధుల కొరత ఎంతమాత్రం అడ్డు కాదని ఈ విషయంలో పూర్తి తోడ్పాటును అందిస్తామని సీతారామన్ వెల్లడించారు. ప్రస్తుతం ఐఏఎఫ్‌కు 42 స్క్వాడ్రన్లు అవసరం కాగా 33 మాత్రమే ఉన్నాయి. ఈ లోపాన్ని అధిగమించేందుకు తక్షణ ప్రాతిపదికన యుద్ధ విమానాలను సమకూర్చుకోవాల్సిన అవసరం ఉందని, దీర్ఘకాలంగా ప్రభుత్వంపై ఐఏఎఫ్ ఒత్తిడి తెస్తూనే ఉంది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడిన సీతారామన్ మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా దేశీయంగా ఐఏఎఫ్ అవసరాలను ఏమేరకు తీర్చుకోవచ్చునో అంచనా వేయాలని డిఆర్‌డిఓను కోరారు. కాగా, ఈ సందర్భంగా మాట్లాడిన ఎయిర్ చీఫ్ మార్షల్ ధనావో ఐఏఎఫ్ వైమానిక దళ శక్తిని ఎప్పటికప్పుడు పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని, అందుకు అవసరమైన శిక్షణను నిరంతరం కొనసాగించాలని సూచించారు. ఎప్పుడు ఎలాంటి అవసరాలు ఏర్పడ్డా అన్నింటికంటే ముందుండేది వైమానిక దళమేనని పేర్కొన్న ఆయన దీని అవసరాలను తక్షణ ప్రాతిపదికన ఎప్పటికప్పుడు తీర్చాల్సిందేనని తెలిపారు.

చిత్రం..ఐఏఎఫ్ కమాండర్ల సమావేశంలో మాట్లాడుతున్న రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్