జాతీయ వార్తలు

వానే.. ఉసురుతీసింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 11: ముంబయి ఎల్ఫిన్‌స్టోన్ బ్రిడ్జిమీద 23మంది ప్రయాణికుల ఊపిరి ఆగిపోవడానికి కారణం వర్షమేనంటూ దర్యాప్తు బృందం తేల్చేసింది. ‘వర్షమే 23మంది ఊపిరి తీసింది. భారీ వర్షంతో అయోమయానికి గురైన ప్రయాణికులు, తలదాచుకోవడానికి ఆకస్మికంగా బ్రిడ్జి మీదకు చేరడంతో తొక్కిసలాట తలెత్తింది’ అంటూ దర్యాప్తు బృందం తన నివేదికలో స్పష్టం చేసింది. దుర్ఘటనపై పశ్చిమ రైల్వే చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ నేతృత్వంలో ప్రత్యేక బృందం దర్యాప్తు జరిపిన విషయం తెలిసిందే. వీడియో ఫుటేజీలను పరిశీలించి, ఘటనలో ప్రాణాలతో బయటపడిన 30మంది బాధితుల నుంచి వాంగ్మూలాలు నమోదు చేసిన దర్యాప్తు బృందం, బుధవారం పశ్చిమ రైల్వే జనరల్ మేనేజర్ అనిల్ కుమార్‌కు ప్రమాదంపై నివేదిక అందించారు. దర్యాప్తు నివేదిక ప్రకారం ఆకస్మిక వర్షంతో టికెట్ కౌంటర్ల వద్దనున్న ప్రయాణికులు తల దాచుకోవడానికి ఒక్కసారిగా ఎల్ఫిన్‌స్టోన్ బ్రిడ్జిమీదకు చేరుకున్నారు. అప్పటికే కిక్కిరిసివున్న బ్రిడ్జిమీదకు అంతమంది చేరడంతో తొక్కిసలాట జరిగినట్టు పేర్కొన్నారు. ఇదిలావుంటే, దుర్ఘటనపై విచారాన్ని వ్యక్తం చేసిన రైల్వే మంత్రి పియూష్ గోయల్, కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జి విషయంలో ముందే నిర్ణయం తీసకునివుంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదేమో అని వ్యాఖ్యానించారు. ‘కొత్త ఫుట్‌ఓవర్ బ్రిడ్జి శాంక్షన్ ఫైల్ చూసినపుడు చాలా బాధనిపించింది. దాని డిజైన్లు ఖరారు చేసి, టెండర్ దశకు తీసుకురావడానికి కొన్ని నెలల సమయం పట్టింది. ఈలోగా ఈ దుర్ఘటన జరగడం బాధాకరం. నిజానికి ఈ దుర్ఘటన రైల్వే కళ్లు తెరిపించేదే. సమర్థవంతమైన, వేగవంతమైన విధానాన్ని మేం అనుసరించాలి’ అని వ్యాఖ్యానించారు. అయితే, దర్యాప్తు బృందం ఇచ్చిన నివేదికపై వ్యాఖ్యానించడానికి తిరస్కరించారు. భారీ లగేజీలతో ప్రయాణికులు ఒక్కసారిగా బ్రిడ్జిమీదకు చేరడంతో అదుపుతప్పి ప్రమాదం చోటుచేసుకుందన్న విషయాన్నీ దర్యాప్తు నివేదికలో పొందుపర్చారు. సాక్షులు అందించిన వివరాల్లో షార్ట్ సర్క్యూట్ కారణమన్న విషయం ఎక్కడా లేదని నివేదికలో పేర్కొన్నారు. రద్దీ సమయాల్లో భారీ లగేజీతో ఫుట్‌ఓవర్ బ్రిడ్జిల మీదకు ప్రయాణికులు చేరకుండా చూడాలని దర్యాప్తు బృందం రైల్వేకు సిఫార్స్ చేసింది. అలాగే రద్దీ సమయాల్లో వీధి దుకాణందార్లు వస్తువుల అమ్మకాలకోసం లగేజీ పట్టుకుని బ్రిడ్జిల మీదకు చేరకుండా కూడా నియంత్రించాలని సిఫార్స్ చేసింది. బ్రిడ్జికి ఆనుకునివున్న టికెట్ కౌంటర్లను కొంచెం దూరం జరిపి విశాలం చేయాలని, వీలైతే బ్రిడ్జికి అదనపు మెట్లు ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలని సూచించింది. ప్రమాదాలు సంభవించినపుడు సాధారణ, భద్రతా సిబ్బంది తక్షణం స్పందించడానికి వీలుగా విస్తృత సమాచార సరఫరాకు వైర్‌లెస్ హ్యాండ్‌సెట్లు, మొబైల్స్‌లాంటి ప్రత్యేక పరికరాలు అందించాలని సిఫార్స్ చేసింది.