జాతీయ వార్తలు

న్యూ ఇండియా దిశగా అడుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 11: దేశ రాజధాని ఢిల్లీ ఓ కొత్త ఆవిష్కరణకు వేదిక కానుంది. ‘న్యూ ఇండియా-2022’ పేరుతో గురువారం ఇక్కడ జరగనున్న గవర్నర్ల సమావేశంలో మార్గనిర్దేశన చేయనున్నారు. రెండు రోజుల గవర్నర్ల భేటీ ఎన్నో ప్రాధాన్యతనలు సంతరించుకుంది. రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత అధ్యక్షత వహిస్తున్న అత్యంత కీలకమైన తొలి సమావేశమిది. రాష్టప్రతి భవన్‌లో జరిగే సమావేశానికి 27 మంది గవర్నర్లు, ముగ్గురు లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర పాలిత ప్రాంత ప్రతినిధులు హాజరవుతున్నారు.
అలాగే ఉపరాష్టప్రతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్రమోదీ గవర్నర్ల సమావేశంలో ప్రసంగిస్తారు. కార్యక్రమానికి సంబంధించి రాష్టప్రతి భవన్ ఓ ప్రకటన విడుదల చేసింది. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లవుతున్న సందర్భంగా ‘న్యూ ఇండియా-2022’ సమావేశం జరుగుతోంది. ఈ నూతన భారత్‌లో దేశ పౌరులకు అవసరమైన వౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తారు. అనేక రకాలైన సేవలను ప్రజలకు చేరువ చేయాలని సంకల్పించారు. ముఖ్యంగా నాణ్యమైన విద్య, శిక్షణ, స్కిల్ డెవలప్‌మెంట్, హెల్త్‌కేర్, పరిశుభ్రత, బహిరంగ ప్రాంతాల్లో మలవిసర్జన లేని నగరాలు, గ్రామాలు ఏర్పాటు, ప్రజలకు భద్రత, రక్షణ, కాలుష్య రహిత వాతావరణ కల్పనకు ఇందులో చోటు కల్పించారు. నీతీ ఆయోగ్ ప్రజంటేషన్‌నో తొలి సెషన్ ప్రారంభవవుతుంది. న్యూ ఇండియా-2022లో పొందుపరిచిన వౌలిక సదుపాయాల కల్పన అలాగే ప్రజలకు అందించే సేవలపై గవర్నర్లకు సవివరంగా తెలుపుతారు. రెండు గ్రూపులుగా ఏర్పాటు చేసి ప్రజాసేవల గురించి వివరిస్తారని ఆ ప్రకటనలో తెలిపారు.
సకండ్ సెషన్‌లో ఉన్నత విద్య, స్కిల్ డెవలప్‌మెంట్ అంశాలుంటాయి. లక్ష్యాన్ని చేదించేందుకు తీసుకోవల్సిన అంశాలపై గవర్నర్లు తమ అనుభవాలు, సూచనలు, సలహాలు చేస్తారు. రెండోరోజు థర్డ్ సెషన్‌లో ఆయా రాష్ట్రాలకు సంబంధించి గవర్నర్లు తన అభిప్రాయలు వెల్లడిస్తారని తెలిపారు. సమావేశం ఉద్దేశం, లక్ష్యాలపై ముగింపుసమావేశంలో చర్చిస్తారు. కేంద్ర హోమ్‌మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ తదితరులు హాజరవుతారు.