జాతీయ వార్తలు

డార్జిలింగ్‌లో అశాంతికి కేంద్రానిదే బాధ్యత: మమత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జహర్‌గ్రామ్, అక్టోబర్ 11: కేంద్ర ప్రభుత్వం వల్లే డార్జిలింగ్‌లో అనిశ్చితి నెలకొందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. డార్జిలింగ్‌లో అశాంతికి కేంద్రానిదే బాధ్యత అంటూ బుధవారం ఇక్కడ విరుచుకుపడ్డారు. శాంతిని భగ్నంచేసే వదంతులను నమ్మొద్దని, అలాంటి వారిపట్ల తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని ఉన్నతస్థాయి సమావేశంలో ఆమె హెచ్చరించారు. పర్వత ప్రాంత ప్రజలు, అలాగే ఒకప్పుడు మావోల ప్రాబల్యం ఉండే జంగల్‌మహల్‌లో ఉంటున్నవారు వందతులకు దూరంగా ఉండాలని, సమ్యమనం పాటించాలని ఆమె పిలుపునిచ్చారు. ‘పర్వత ప్రాంతం డార్జిలింగ్‌లో పరిస్థితులు అన్నీ కుదుటపడ్డాయి. ఢిల్లీ పెద్దల జోక్యంతో మళ్లీ అశాంతి నెలకొంటోంది. కొద్ది రోజులుగా పరిస్థితి ఉంది.. అయినా మామూలు పరిస్థితులు నెలకొంటాయి’ అని మమత అన్నారు. ‘ప్రతి ఒక్కరిని నేను కోరేది ఒక్కటే. వందతులు నమ్మొద్దు. నేను మీ అందరికీ బాసటగా నిలబడతా. ఓ స్నేహితురాలిగా ఉంటా’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో అశాంతి పరిస్థితులు సృష్టించడానికి ఓ పార్టీ ప్రయత్నిస్తోందని బిజెపి ఉద్దేశించి మమత నిప్పులు చెరిగారు. ప్రజల్లో వైషమ్యాలు సృష్టించడానికి కుట్ర జరుగుతోందని ఆమె ఆరోపించారు. ప్రజలను మతాలు, కులాలు, వర్గాల పేరుతో విడదీయడానికి ప్రయత్నిస్తున్నారని ఆమె విమర్శించారు.