జాతీయ వార్తలు

ఉత్తర్వుల్ని సడలించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 11: ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాం (ఎన్‌సిఆర్)లో బాణసంచా అమ్మకాల్ని నిషేధిస్తూ జారీచేసిన ఆదేశాలను సడలించాలని కోరుతూ బాణసంచా వ్యాపారులు బుధవారం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. నవంబర్ 1వ తేదీ వరకు బాణసంచా అమ్మకాలపై నిషేధం విధిస్తూ సుప్రీం కోర్టు ఈ నెల 9న ఆదేశించిన విషయం విదితమే.
అయితే బాణసంచా విక్రయాన్ని అనుమతిస్తూ సెప్టెంబర్ 12న సుప్రీం జారీచేసిన ఆదేశాల మేరకు లైసెన్సులను పునరుద్ధరించుకుని భారీ మొత్తంలో బాణసంచాను అమ్మకాల కోసం సమకూర్చుకున్నామని వ్యాపారులు కోర్టుకు విన్నవించుకున్నారు. సెప్టెంబర్ 12న జారీచేసిన ఆదేశాలు నవంబర్ 1 నుంచి అమలులోకి వస్తాయని తాజాగా జారీచేసిన ఆదేశాలతో తాము తీవ్రంగా నష్టపోతామని కోర్టుకు తెలిపారు. వ్యాపారుల తరపున వాదిస్తున్న న్యాయవాది దీపక్ చౌహాన్ దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందిస్తూ జస్టిస్ రంజన్ గొగోయ్, ఎ.ఎం.సప్రే, నవీన్ సిన్హాతో కూడిన సుప్రీం బెంచ్ స్పందిస్తూ ఆదేశాలు జారీచేసిన సంబంధిత న్యాయమూర్తితో సంప్రదించిన తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. లైసెన్సులు పునరుద్ధరించడంతో భారీ మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టి బాణసంచాను సమకూర్చుకున్నారని, తాజా ఆదేశాలతో వ్యాపారులు తీవ్రంగా నష్టపోతారని పిటిషన్‌లో పేర్కొన్నారు.
బాణసంచా దిగుమతికి అనుమతించవద్దు
దేశంలోకి అక్రమంగా బాణసంచా దిగుమతి కాకుండా కేంద్రం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ (సిబిఇసి) తమ సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
బాణసంచా దిగుమతి చేసుకోవాలంటే డైరెక్టరేట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ వారి నుంచి లైసెన్సు తప్పనిసరిగా పొందివుండాలి. అయితే ఇలాంటి లైసెన్సులను ఎవరికీ మంజూరు చేయలేదని, అందుచేత దేశంలోకి విదేశాల నుంచి ముఖ్యంగా చైనా నుంచి ఏ రకమైన మందుగుండు సామగ్రి దిగుమతి కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు చేశారు.

ఇదేం విడ్డూరం!
బేటీ పడావో పోస్టర్‌లో కాశ్మీర్ వేర్పాటువాది

శ్రీనగర్, అక్టోబర్ 11: జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం తాజాగా వెలువడిన ఓ పోస్టర్ వివాదంతో ఇబ్బందికర పరిస్థితిలో పడింది. ‘బేటీ బచావో.. బేటీ పఢావో’ నినాదంతో కూడిన ఓ పోస్టర్‌లో ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ, ఇతర వ్యక్తులతోపాటు ప్రస్తుతం జైల్‌లో ఉన్న వేర్పాటువాద నాయకురాలు అసియా అంద్రబీ ఫొటో కూడా ఉండడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. దేశంలో మహిళల విజయాలను వెలుగులోకి తెస్తూ రూపొందించిన ఈ పోస్టర్‌ను బుధవారం దక్షిణ కాశ్మీర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆవిష్కరించారు. ఈ ఫొటోలో ఉన్న అంద్రబీ పాకిస్తాన్ అనుకూల వేర్పాడువాది. ఈ పోస్టర్‌లో మదర థెరిసా, ఇందిరా గాంధీ, కిరణ్ బేడీ తదితరులు ఫొటోలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం అంద్రబీ ప్రజాభద్రతా చట్టం కింద అరెస్టయి జైలులో ఉన్నారు. పాకిస్తాన్ స్వాతంత్య్ర దినోత్సవం, జాతీయ దినోత్సవాల సందర్భంగా ఆ దేశ పతాకాన్ని ఆవిష్కరించడం ద్వారా ఆమె కలకలం రేపిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ అత్యంత ప్రతిష్టాత్మంగా చేపట్టిన బేటీ బచావో..బేటీ పడావో ప్రచార పోస్టర్‌లో ఓ వేర్పాటువాది ఫొటో ఎలావచ్చిందన్న దానిపై ప్రభుత్వ పరంగా ఎలాంటి వివరణ రాలేదు.