జాతీయ వార్తలు

జయ్ వ్యవహారంపై దర్యాప్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 12: బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కుమారుడు జయ్ షాకు చెందిన కంపెనీలు జరిపిన ఆర్థిక వ్యవహారాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి)లు దర్యాప్తు చేయాలని సిపిఎం గురువారం డిమాండ్ చేసింది. సిబిఐ, ఇడిలు జయ్ షా వ్యవహారంపై దర్యాప్తు చేసినప్పుడే, ఆ సంస్థలు చర్యలు తీసుకోవడానికి కొన్నింటిని మాత్రమే ఎంపిక చేసుకోవడం లేదనేది ధ్రువపడుతుందని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ పేర్కొన్నారు. ఒకవైపు మోదీ ప్రభుత్వం సిబిఐ, ఇడి, ఆదాయపు పన్ను శాఖల ద్వారా పలువురు వ్యాపారులు, విపక్షాలకు చెందిన రాజకీయ నాయకులపై అవినీతి, నల్లధనం అభియోగాలు మోపుతోందని, మరోవైపు జయ్ షాపై వచ్చిన ఆరోపణలను పట్టించుకోకుండా భిన్నంగా వ్యవహరిస్తోందని సిపిఎం అధికార పత్రిక ‘పీపుల్స్ డెమొక్రసీ’ తాజా సంచికలో ప్రచురించిన సంపాదకీయంలో కారత్ పేర్కొన్నారు.

చిత్రం..అగర్తలాలో గురవారం త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్‌తో కలిసి బిర్‌చంద్ర మనూకు నివాళులు అర్పించేందుకు వస్తున్న సిపిఎం నేత ప్రకాశ్ కారత్