జాతీయ వార్తలు

4,548 మంది వైద్యుల రిజిస్ట్రేషన్ రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 13: వైద్య విద్య పూర్తయిన తరువాత కనీసం ఏడాది పాటు గ్రామీణ ప్రాంతాల్లో తప్పనిసరిగా పనిచేయాలన్న నిబంధనను పాటించని కారణంగా 4,548 మంది డాక్టర్ల రిజిస్ట్రేషన్‌ను మహారాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో వైద్య విద్యను అభ్యసించిన డాక్టర్లు ఒప్పందం ప్రకారం కనీసం ఏడాది పాటు గ్రామీణ ప్రాంతాల్లో తమ సేవలను అందించాల్సి ఉందని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (డిఎంఇఆర్) అధికారి ఒకరు చెప్పారు. కనీసం ఏడాది పాటు గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందించాలని మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిబంధనను పాటించడంలో విఫలమైన కారణంగా డిఎంఇర్ ఈ డాక్టర్ల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసింది. ఒకవేళ గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయకపోతే అందుకు బదులుగా జరిమానా చెల్లించడానికి వైద్యులకు అవకాశం ఉంది. అయితే ఈ డాక్టర్లు నిబంధనల ప్రకారం జరిమానా కూడా చెల్లించలేదని డిఎంఇఆర్ తెలిపింది. ప్రభుత్వ చర్యకు గురయిన ఈ 4,548 మంది డాక్టర్లు 2005-12 మధ్య కాలంలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో విద్యను అభ్యసించారు.
డాక్టర్లు ఒప్పందం ప్రకారం కనీసం ఏడాది పాటు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయకపోతే ఎంబిబిస్ చదివిన వారు రూ. పది లక్షలు, పోస్టుగ్రాడ్యుయేషన్ చేసిన వారు రూ. 50 లక్షలు, సూపర్ స్పెషాలిటి డాక్టర్లు రూ. రెండు కోట్ల చొప్పున జరిమానా చెల్లించవలసి ఉంటుందని డిఎంఇఆర్ అధిపతి డాక్టర్ ప్రవీణ్ శింగారే తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తాం, లేదా జరిమానా చెల్లిస్తాం అని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి ఈ డాక్టర్లందరికీ తగినంత సమయం ఇచ్చామని ఆయన పేర్కొన్నారు. ఈ రెండు నిబంధనలనూ ఉల్లంఘించిన కారణంగా ఈ డాక్టర్లపై కఠిన చర్య తీసుకోవడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. వైద్య సేవలు అందించే ప్రతి డాక్టర్ తమ రిజిస్ట్రేషన్‌ను మహారాష్ట్ర వైద్య మండలి వద్ద రెన్యూవల్ చేయించుకోవలసి ఉంటుందని రాష్ట్ర వైద్యవిద్యా విభాగానికి చెందిన ఒక సీనియర్ అధికారి తెలిపారు. రిజిస్ట్రేషన్‌ను కోల్పోయిన ఈ డాక్టర్లంతా బోగస్ డాక్టర్లుగా పరిగణింపబడతారని, వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన వివరించారు.