జాతీయ వార్తలు

ఫైర్‌వాల్ తయారీకి నిపుణుల కమిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 13: అనేక ఆత్మహత్యలకు దారితీస్తున్న బ్లూవేల్ వంటి గేమ్‌లకు ఫైర్‌వాల్‌ను ఏర్పాటు చేయించాలని కోరుతూ దాఖలయిన పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు శుక్రవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. బ్లూవేల్ వంటి గేమ్‌లను నియంత్రించడానికి ఫైర్‌వాల్‌లను అభివృద్ధి చేసేందుకు ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రైవేట్ నెట్‌వర్క్ నుంచి అనధికారికంగా ఇన్‌కమింగ్, ఔట్‌గోయింగ్ నెట్‌వర్క్ ట్రాఫిక్‌ను నియంత్రించకుండా అడ్డుకోవడానికి రూపొందించిన వ్యవస్థే ఫైర్‌వాల్. అయితే ఆన్‌లైన్ గేమ్‌లపై నిషేధాన్ని కోరుతూ లేదా ఫైర్‌వాల్ ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలయ్యే పిటిషన్లను విచారణకు స్వీకరించకూడదని న్యాయమూర్తులు ఎఎం ఖన్‌విల్కర్, డివై చంద్రచూడ్‌లు సభ్యులుగా గల ఈ ధర్మాసనం అన్ని హైకోర్టులను ఆదేశించింది. ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది పిల్లలు, యువకుల మరణాలకు దారితీసిన బ్లూవేల్ చాలెంజ్ గేమ్‌ను నిషేధించాలని కోరుతూ తమిళనాడుకు చెందిన 73 ఏళ్ల వ్యక్తి ఒకరు దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం ఇదివరకే విచారిస్తోంది. సామాజిక మాధ్యమాల నుంచి బ్లూవేల్ చాలెంజ్ గేమ్‌కు ఉన్న అనుసంధానాన్ని తొలగింపచేయాలని కోరుతూ దాఖలయిన ఒక పిటిషన్‌కు సమాధానం ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టు ఆగస్టు 22న ఫేస్‌బుక్, గూగుల్, యహూలను ఆదేశించింది. బ్లూవేల్ గేమ్‌ను తీవ్రంగా పరిగణించిన మద్రాస్ హైకోర్టు దీనిపై నిషేధం విధించడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని సెప్టెంబర్ 4న కేంద్రాన్ని, తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. తరువాత, బ్లూవేల్ చాలెంజ్ గేమ్‌ను నిషేధించడానికి మద్రాస్ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా తీసుకున్న చర్యలేమితో తనకు తెలియజేయాలని ఢిల్లీ హైకోర్టు సెప్టెంబర్ 19న కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. బ్లూవేల్ చాలెంజ్ గేమ్ అనేది ఆత్మహత్యకు పురికొల్పే గేమ్ అని ఆరోపణలు ఉన్నాయి. ఈ గేమ్‌లో ప్లేయర్‌కు 50 రోజులకు పైగా నిర్దిష్టమైన లక్ష్యాలను ఇస్తారు. ఈ లక్ష్యాలు చివరకు ప్లేయర్ ఆత్మహత్యతో ముగుస్తాయి.