జాతీయ వార్తలు

జయ్ షా కంపెనీలో అవినీతి జరుగలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్, అక్టోబర్ 13: జయ్ షా కంపెనీలో ఎలాంటి అవినీతి చోటు చేసుకోలేదని అతని తండ్రి, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పేర్కొన్నారు. జయ్ షా కంపెనీ ఎలాంటి ప్రభుత్వ భూమిని తీసుకోలేదని, ప్రభుత్వంతో ఎలాంటి వ్యాపార ఒప్పందం కుదుర్చుకోలేదని ఆయన అన్నారు. జయ్ షాకు చెందిన కంపెనీ టర్నోవర్ 2014లో బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత పెద్ద ఎత్తున పెరిగిందని ‘ద వైర్’ అనే న్యూస్ పోర్టల్ ఒక పరిశోధనాత్మక కథనంలో పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే ‘ఆజ్ తక్’ చానల్ శుక్రవారం ఇక్కడ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఈ అంశంపై అడిగిన ఒక ప్రశ్నకు అమిత్ షా బదులిస్తూ జయ్ షా కంపెనీలో అవినీతికి సంబంధించిన ప్రశే్న ఉత్పన్నం కాదని అన్నారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్‌పై ఎదురుదాడికి దిగారు. జయ్ షా తనపై చేసిన ఆరోపణలకు వ్యతిరేకంగా రూ. వంద కోట్లకు పరువు నష్టం దావా వేశారని అమిత్ షా పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ తనపై ఆరోపణలు వచ్చినప్పుడు ఇలా పరువు నష్టం దావా ఎందుకు వేయలేదని, వారికి ఎందుకు ఆ ధైర్యం లేదని ఆయన నిలదీశారు. బోఫోర్స్ ఒప్పందంలో మాదిరిగా జయ్ షా కంపెనీ ఎలాంటి కమిషన్ తీసుకోలేదని ఆయన కాంగ్రెస్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జయ్ షా కంపెనీ బియ్యం, చిరు ధాన్యాల వంటి వాటి వ్యాపారం చేస్తోందని ఆయన పేర్కొన్నారు. కంపెనీ రూ. 80 కోట్ల వ్యాపారం చేసిందని వారు అంటున్నారని, అయితే రూ. 1.5 కోట్ల నష్టం వచ్చిన విషయాన్ని వారు ఎందుకు చెప్పడం లేదని అమిత్ షా అన్నారు. ఈ వ్యాపారంలో ఎక్కువ టర్నోవర్, తక్కువ లాభం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇందులో మనీలాండరింగ్ ఎక్కడ జరిగిందని ఆయన ప్రశ్నించారు.