జాతీయ వార్తలు

సుప్రీం తీర్పుతో బాల్య వివాహాలకు చెక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 13: మైనారిటీ తీరని భార్యతో లైంగిక సంపర్కం అత్యాచారమేనంటూ ఇటీవల సుప్రీంకోర్టు సంచలనాత్మక రీతిలో ఇచ్చిన తీర్పును కేంద్ర ప్రభుత్వం సవాల్ చేసే అవకాశం కనిపించడం లేదు. అందుకు కారణం దేశంలో పెరిగిపోతున్న బాల్య వివాహాలకు సుప్రీంకోర్టు తీర్పు బలమైన అడ్డుకట్ట వేసే అవకాశం ఉండటమేనని సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కచ్చితంగా బాల్య వివాహాలను గణనీయంగా అరికట్టేందుకు దోహదం చేసే అవకాశం ఉందని, పైగా చట్టబద్ధంగా కూడా ఎవరూ ఈ రకమైన చర్యలకు పాల్పడకుండా సర్వోన్నత న్యాయస్థానం తీర్పు నిలువరించగలుగుతుందని ఆయన పేర్కొన్నారు. బాల్య వివాహాలకు సంబంధించి తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదురవుతున్నప్పటికీ సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ రకమైన సంస్కృతికి త్వరితగతిన చరమగీతం పాడే అవకాశం కలిగిందన్న అభిప్రాయం ప్రభుత్వంలో కలుగుతోందని ఆయన అన్నారు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకునే సుప్రీం తీర్పును సవాలు చేయకూడదన్న అభిప్రాయంతో కేంద్రం ఉన్నట్లుగా ఆయన తెలిపారు. 18 సంవత్సరాల లోపు వయసు కలిగిన భార్యతో లైంగిక సంపర్కం నేరమేనని, అది అత్యాచారం కిందకే వస్తుందంటూ సుప్రీంకోర్టు మంగళవారం నాడు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. భార్య వయసు 15-18 సంవత్సరాల మధ్య ఉన్నప్పటికీ వారితో లైంగిక సంపర్కాన్ని మినహాయిస్తూ భారత శిక్షాస్మృతిలోని ఓ నిబంధనను కూడా సుప్రీంకోర్టు ఈ సందర్భంగా ఉదహరించింది. ఆ నిబంధన రాజ్యాంగ విరుద్ధమని కూడా తేల్చిచెప్పింది.