జాతీయ వార్తలు

అత్యంత సురక్షిత నగరం టోక్యో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 13: ప్రపంచంలో అత్యంత సురక్షితమైన, భద్రతాయుతమైన నగరంగా టోక్యో మరోసారి ప్రథమ స్థానాన్ని సంతరించుకుంది. ఈ విషయంలో ఢిల్లీ 43వ స్థానాన్ని, ముంబయి 45వ స్థానాన్ని పొందాయి. ది ఎకనమిస్ట్ పత్రిక ప్రపంచవ్యాప్తంగా వివిధ నగరాలను భద్రతా పరిస్థితుల ప్రాతిపదికగా అధ్యయనం చేసి ఈ నివేదికను రూపొందించింది. వ్యక్తిగత భద్రత, వౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, డిజిటల్ సౌకర్యాలు సహా మొత్తం 49 అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ భద్రతా సూచీని రూపొందించింది. అట్టడుగున ఉన్న పది నగరాల్లో ఢాకా, కరాచీలు ఉన్నాయి. అలాగే ఆగ్నేయాసియా ప్రాంతంలో మనీలా, జకార్తాలు ఉన్నాయి. మధ్యప్రాచ్య ఆఫ్రికా దేశాల్లో కైరో, టెహ్రాన్‌లు ఉన్నాయని ది ఎకనమిస్ట్ తెలిపింది. 2016లో ప్రపంచవ్యాప్తంగా కోటి మందికి పైగా ప్రజలు కలిగిన మెగాసిటీలు 31 ఉన్నాయని పేర్కొన్న ఈ అధ్యయన నివేదిక రానున్న పదమూడు సంవత్సరాల కాలంలో ఈ నగరాల్లో నివసించే వారి సంఖ్య కోటీ 11 లక్షలకు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఈ నగరాలన్నీ ఆర్థికంగా క్రియాశీలకంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ వాటిలో నివసిస్తున్న పౌరులకు భద్రతాపరంగా ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయని ఈ నివేదికని రూపొందించిన క్రిస్ క్లేగ్ వెల్లడించారు. ఈ అధ్యయనంలో భాగంగా మెగా నగరాల్లో తీవ్రమవుతున్న ఉగ్రవాదం, దానివల్ల ఆయా దేశాల రాజధాని నగరాల్లో ప్రజలకు భద్రతాపరంగా ఎదురవుతున్న సవాళ్లను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. లండన్, పారిస్, బార్సిలోనాల్లో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడులను ఉదహరిస్తూ సుసంపన్నమైన పట్టణ కేంద్రాలు ఉగ్రవాద దాడులకు గురవుతున్నాయని, వాటిని కేంద్రంగా చేసుకుని ఈ రకమైన విచ్ఛిన్నకర కార్యకలాపాలు సాగుతున్నాయని తెలిపింది. ఈ పట్టణాల్లో నివసిస్తున్న ప్రజల మధ్య ఆదాయపరంగా ఉన్న తారతమ్యాలను కూడా పరిగణిస్తూ ఈ పరిస్థితి తీవ్రమైతే 2011లో లండన్‌లో జరిగిన దాడుల మాదిరిగా హింసాత్మక కార్యకలాపాలు పెచ్చరిల్లే అవకాశముందని కూడా హెచ్చరించింది. గతంలో టాప్ టెన్ దేశాల్లో ఉన్న జపాన్ ఇప్పుడు వౌలిక సదుపాయాల కల్పన, భద్రత విషయంలో 12వ స్థానానికి తగ్గింది. అయితే వరుసగా మూడో సంవత్సరం కూడా మొత్తంమీద తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటూ వచ్చింది.