జాతీయ వార్తలు

గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ ఏమైంది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 13: హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఒకేసారి షెడ్యూల్‌ను ఎందుకు ప్రకటించలేదని ఎన్నికల కమిషన్‌ను సిపిఎం శుక్రవారం నిలదీసింది. హిమాచల్‌ప్రదేశ్‌లో ఒకే విడతగా నవంబర్ 9న పోలింగ్ జరుగుతుందని, డిసెంబర్ 18న ఫలితాలు వెల్లడించడం జరుగుతుందని పేర్కొన్న ఎన్నికల కమిషన్ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడిగా విడుదల చేయడం జరుగుతుందని గురువారం ప్రకటించింది. ఎన్నికల కమిషన్ గుజరాత్ ఎన్నికల తేదీని ప్రకటించకుండా, కేవలం హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల తేదీని మాత్రమే ఎందుకు ప్రకటించిందో అంతుబట్టడం లేదని సిపిఎం పొలిట్‌బ్యూరో ఇక్కడ ఒక ప్రకటనలో పేర్కొంది.ఎన్నికల కమిషనర్ హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు విడుదల అయ్యే డిసెంబర్ 18వ తేదీలోగా గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారని పేర్కొంటూ, ఇలా ఎందుకు ప్రకటించారని సిపిఎం నిలదీసింది. అయితే గుజరాత్ ఎన్నికలు డిసెంబర్ 18వ తేదీలోగా పూర్తయ్యేదుంటే ఆ రాష్ట్రానికి కూడా వెంటనే తప్పనిసరిగా ఎన్నికల నియమావళి వర్తించాలని సిపిఎం పొలిట్‌బ్యూరో పేర్కొంది.