జాతీయ వార్తలు

మోదీ ఒత్తిడే కారణమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,అక్టోబర్ 13: కేంద్ర ఎన్నికల సంఘం హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించి గుజరాత్ ఎన్నికల షెడ్యూలును తరువాత ప్రకటిస్తామని చెప్పటం వివాదాస్పదమైంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈనెల 16న గుజరాత్‌లో జరుపునున్న పర్యటనను దృష్టిలో పెట్టుకునే కేంద్ర ఎన్నికల సంఘం ఈ విధంగా వ్యవహరించిందని కాంగ్రెస్, సిపిఎంలు ఆగ్రహం వ్యక్తం చేశాయ. మోదీ గుజరాత్ పర్యటనలో రాష్ట్రానికి తాయలాలు ప్రకటించే అవకాశం ఉందని, అందుకే కేంద్ర ఎన్నికల సంఘంపై నరేంద్రమోదీ ఒత్తిడి తీసుకువచ్చి శాసన సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనను వాయదా వేయంచారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జేవాలా ధ్వజమెత్తారు. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ శాసన సభల ఎన్నికలు వారం, పది రోజుల తేడాతో జరగాల్సి ఉన్నప్పుడు రెండు రాష్ట్రాల శాసన సభల ఎన్నికల షెడ్యూలును ఒకేసారి ఎందుకు ప్రకటించలేదని ఆయన నిలదీశారు. ఇదిలా ఉంటే సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కూడా గుజరాత్ ఎన్నికల షెడ్యూలును తరువాత వెళ్లడిస్తామంటూ కేంద్ర ఎన్నికల సంఘం చేసిన ప్రకటనను తప్పుబడుతున్నారు. గుజరాత్ శాసన సభ ఎన్నికలను డిసెంబర్ 18 తేదీలోగా ముగిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన గురించి ప్రస్తావిస్తూ 18 తేదీలోగా నిర్వహిస్తామని చెప్పటం చూస్తుంటే ఎన్నికల షెడ్యూలు సిద్ధమైనట్లేనట్లే కదా? ఎవరి ఒత్తిడితో ఈ షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేయకుండా ఆపిందని సీతారాం ఏచూరి ప్రశ్నించారు. కాగా ఈ ఆరోపణలను బిజెపి తీవ్రస్థాయలో ఖండించింది. కాంగ్రెస్, సిపిఎం నేతలు వాస్తవాలు తెలుసుకొని ఆరోపణలు చేయాలని, ఐదేళ్ల క్రితం కూడా కేంద్ర ఎన్నికల సంఘం హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును విడివిడిగా ప్రకటించటం మరచిపోవద్దని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ గుర్తుచేశారు.