జాతీయ వార్తలు

హనీప్రీత్‌కు 23వరకు జ్యుడీషియల్ కస్టడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 13: డేరా బాబా గుర్మీత్‌సింగ్ దత్తపుత్రికగా భావిస్తున్న హనీప్రీత్, ఆమె సహచరురాలు సుఖ్‌దీప్‌కౌర్‌లను ఈ నెల 23 వరకు జ్యుడీషియల్ కస్టడీలో ఉంచాలని పంచకుల జిల్లా కోర్టు శుక్రవారం ఆదేశించింది. ఈ విషయాన్ని న్యాయవాది ఎస్.కె.గార్గ్ నర్వానా వెల్లడించారు. వీరిద్దరినీ ప్రధాన జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ రోహిత్ వాట్స్ కోర్టులో గట్టి భద్రతా ఏర్పాట్ల మధ్య హాజరుపరిచారు. గత తొమ్మిది రోజులుగా వీరిద్దరూ పోలీసు రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా కోర్టు తీర్పు నేపథ్యంలో వీరిని అంబాలా సెంట్రల్ జైల్లో ఉంచుతామని, ఈ నెల 23న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందుకు తీసుకువస్తామని అధికారులు తెలిపారు.
పంచకులలో జరిగిన హింసాకాండ వెనుక తన హస్తం ఉన్నట్లు ఇంటరాగేషన్‌లో హనీప్రీత్ వెల్లడించారని హర్యానా ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రత్యేక సిట్ వెల్లడించింది. డేరాబాబా అరెస్టు నేపథ్యంలో జరిగిన హింసాకాండలో 41మంది మరణించగా, 250మంది గాయపడ్డారు. హింసాకాండను సృష్టించాలని డేరా సభ్యులను ఆదేశించడంతో పాటు అందుకు సంబంధించిన బ్లూప్రింట్‌ను కూడా సిద్ధం చేశామని హనీప్రీత్ పోలీసుల ముందు అంగీకరించినట్లుగా తెలుస్తోంది. ఈ అల్లర్లు జరిపేందుకు 1.25 కోట్ల రూపాయలు ఇచ్చినట్లుగా ఆమె వెల్లడించినట్లు తెలుస్తోంది.