జాతీయ వార్తలు

బిహార్ అభివృద్ధికి నిబద్ధుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా, అక్టోబర్ 14: బిహార్ రాష్ట్ర అభివృద్ధికి నిబద్ధుడయిన నేత నితీశ్ కుమార్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ (యునైటెడ్) తిరిగి ఎన్‌డిఎ కూటమిలో చేరిన తరువాత ఈ ఇద్దరు నేతలు తొలిసారి శనివారం ఇక్కడ ఒకే వేదికను పంచుకున్నారు. ప్రతిష్ఠాత్మక పాట్నా విశ్వవిద్యాలయ శత జయంతి ఉత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఈ ఇద్దరు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ నితీశ్ కుమార్ పనితీరుపై ప్రశంసలు కురిపించారు. నితీశ్ కుమార్ బిహార్ రాష్ట్ర అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తున్నారని, దేశాన్ని అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకున్నదని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 2022 నాటికి బిహార్‌ను దేశంలోని అభివృద్ధి చెందిన రాష్ట్రాల సరసన నిలబెడతాయని మోదీ అన్నారు. ప్రధానమంత్రి మోదీ పాట్నా యూనివర్శిటీ శత జయంతి ఉత్సవాలలో పాల్గొన్న ఈ రోజు ఎంతో గౌరవప్రదమైన రోజని నితీశ్ కుమార్ తన స్వాగతోపన్యాసంలో పేర్కొన్నారు.