జాతీయ వార్తలు

రాజకీయ పార్టీలకు నిధులే.. నిధులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 23: దేశంలోని వివిధ రాజకీయ పార్టీలకు ఎన్నికల్లో సేకరించే నిధుల్లో 63 శాతం వరకూ నగదు రూపేణా వస్తున్నవేనని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఎడిఆర్) సంస్థ వెల్లడించింది. 2004-2015 మధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మొత్తం 2,100 కోట్ల రూపాయలు నిధులు సమకూర్చుకున్నట్టు ఎడిఆర్ తెలిపింది. అందులో నగదు రూపేణ వచ్చిన నిధులే అధికమని వారు చెప్పారు. ఎడిఆర్ సేకరించిన గణాంకాలు సోమవారం మీడియాకు వెల్లడించారు. ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ ఎన్నికల సంస్కరణలకోసం పనిచేస్తోంది. 2004-2015 మధ్య 71సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగ్గా 2107.80 కోట్లు సమీకరించుకున్నాయి. 2004, 2009, 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఏకంగా 55 శాతం నిధులు చెక్కుల ద్వారానే పార్టీలకు సమకూరాయని స్పష్టం చేశారు. అవి సుమారు 1039 కోట్ల రూపాయలని ఎడిఆర్ వివరించింది. 2004-2015 మధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చెక్కుల ద్వారా 1244.86 కోట్లు ఆయా రాజకీయ పార్టీలకు వచ్చాయి. కేంద్ర ఎన్నికల సంఘానికి పార్టీలు అందజేసిన అఫిడవిట్లను ఆధారం చేసుకునే ఎడిఆర్ ఈ గణాంకాలు వెల్లడించింది. దేశంలో రాజకీయ పార్టీల నిధుల సమీకరణ విషయంలో పారదర్శకత పాటించడం లేదని బెంగళూరు ఐఐఎంకు చెందిన ప్రొఫెసర్ త్రిలోచన్ శాస్ర్తీ స్పష్టం చేశారు. ప్రాంతీయ పార్టీల నిధుల సేకరణ, వ్యయంపై సర్వే నిర్వహించారు. సమాజ్‌వాదీ పార్టీ, ఆమ్‌ఆద్మీ పార్టీ, అన్నాడిఎంకె, బిజెడి, శిరోమణి అకాలీదళ్ తదితర పార్టీలకు నిధుల సమీకరణ ద్వారా 267.14 కోట్ల రూపాయలు వచ్చాయి. ఇవన్నీ లోక్‌సభ ఎన్నికల లెక్కలే. సమాజ్‌వాదీ పార్టీ అయితే ఏకంగా 118 కోట్లు సేకరించి, 90.09 కోట్లు ఎన్నికల వ్యయంగా చూపించింది.