జాతీయ వార్తలు

‘ఎమరాల్డ్’ నావికులను వెతుకుతున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 17: పసిఫిక్ మహాసముద్రంలో మునిగిపోయిన ‘ఎమరాల్డ్ స్టార్’ రవాణా ఓడనుంచి గల్లంతైన పదిమంది భారతీయ నావికుల ఆచూకీకోసం హెలికాప్టర్లతో వెతుకుతున్నట్టు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఫిలిప్పీన్స్ నుంచి భారత్‌కు బయలుదేరిన ‘ఎమరాల్డ్ స్టార్’ రవాణా ఓడ ఒకటి గత శుక్రవారం పసిఫిక్ మహాసముద్రంలో మునిగిపోవడం తెలిసిందే. ప్రమాదం నుంచి బయటపడిన ఐదుగురు నావికులు ఫిలిప్పీన్స్‌లోని ఇరినెకు చేరడంతో, వారిని మనీలా మీదుగా భారత్‌కు తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. భారత్‌కు బయలుదేరిన నౌకలో 26మంది సిబ్బంది ఉన్నారు. 33,205 టన్నుల బరువైన ‘ఎమరాల్డ్ స్టార్’ ఒకినావాలో మునిగిపోతున్నపుడు ప్రమాదం నుంచి 16మంది నావికులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. అయితే, గల్లంతైన 10మంది నావికులు ఫిలిప్పీన్స్, జపాన్, చైనా సముద్ర తీరాలకు చేరుకుని ఉండొచ్చన్నది అంచనా. ‘గాంగ్‌జ్యు కాన్సులేట్‌లోని గ్జియామెన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 11మంది భారతీయ నావికులను మన అధికారులు కలిశారు. వారు క్షేమంగానే ఉన్నట్టు సమాచారం ఉంది. ఇక గల్లంతైన 10మంది నావికుల ఆచూకీకోసం మర బోట్లు, హెలికాప్టర్లతో వెతుకుతున్నాం. ఆచూకీ తెలియగానే సమాచారం అందిస్తాం’ అని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ ట్వీట్ చేశారు. ప్రమాదంపై విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మ స్వరాజ్ చేసిన వరుస ట్వీట్లలో, 16మంది నావికులు క్షేమం. గల్లంతైన పదిమంది ఆచూకీకోసం దర్యాప్తు సాగుతోంది అని పేర్కొన్నారు. జపాన్ సముద్ర తీరంలో హెలికాప్టర్లు, మరబోట్లతో వెతుకుతున్నట్టు జపాన్‌లోని ఇండియన్ అంబసీ అధికార్లు సమాచారం ఇచ్చారని సుష్మ తన ట్వీట్లలో పేర్కొన్నారు. సముద్రతలంపై సుదూరంగా ప్రయాణించగల నేవీ పి-81 ఎయిర్‌క్రాఫ్ట్‌తోనూ మనీలా సముద్రప్రాంతంలో నావికుల కోసం వెతుకుతున్నట్టు సుష్మ పేర్కొన్నారు.