జాతీయ వార్తలు

మమత వాకౌట్.. నేను షాక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 18: మాజీ రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ తన రాజకీయ అనుభవాన్నంతా రంగరించి నాటి, నేటి నేతల తీరుతెన్నులను కూలంకషంగా విశే్లషిస్తున్నారు. తాజాగా ఆయన రాసిన ‘సంకీర్ణ శకం’ అనే పుస్తకంలో ఫైర్‌బ్రాండ్ అధినేత్రి మమతా బెనర్జీ గురించి ప్రస్తావించారు. మమతను జన్మతః రెబెల్‌గా పేర్కొన్న ఆయన తనకు సంబంధించిన ఒక ఉదంతాన్ని ఉటంకించారు. ఓ సమావేశం నుంచి ఉన్నపళంగా వెళ్లిపోవడం తనకు తీవ్ర అవమానాన్ని కలిగించిందని ముఖర్జీ ఆ పుస్తకంలో వివరించారు. మమతా బెనర్జీ తత్వాన్ని, ఆమె వ్యక్తిత్వాన్ని వివరించడం కష్టమని, అంతమాత్రాన విస్మరించజాలమని స్పష్టం చేశారు. తన రాజకీయ జీవితాన్ని మమత నిర్భయంగా, తిరుగుబాటు ధోరణితోనే నిర్మించుకున్నారని, ఒక రకంగా చెప్పాలంటే ఆమె సాగించిన పోరాట ఫలితమే ఆమె రాజకీయ జీవితమూ, వ్యక్తిత్వమూ అని ముఖర్జీ తెలిపారు. మమతా బెనర్జీ దూకుడుతనాన్ని ఉదహరించడానికి 1992లో పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల సందర్భంగా ఓ ఉదంతాన్ని మించిన ఉదాహరణ మరొకటి లేదన్నారు. అంతకుముందు వరకూ ఏకాభిప్రాయ ప్రాతిపదికన ఎన్నికలు జరగాలని పట్టుబట్టిన మమతా బెనర్జీ అకస్మాత్తుగా తన నిర్ణయం మార్చుకుని బహిరంగ పోటీకి డిమాండ్ చేశారని ముఖర్జీ గుర్తుచేశారు. ఆ సమయంలో అప్పటి ప్రధాని పి.వి.నరసింహారావు తనను పిలిచి బెంగాల్ కాంగ్రెస్ వ్యవహారాన్ని చక్కదిద్దాలని కోరారని తెలిపారు. ఆ సమయంలో తాను చర్చకు రావాల్సిందిగా మమతా బెనర్జీని పిలిచానని, చర్చల సమయంలోనే మమత ఒక్కసారిగా రెచ్చిపోయి తనను, ఇతర కాంగ్రెస్ సీనియర్ నేతలను దుయ్యబట్టడం మొదలుపెట్టారని ముఖర్జీ పేర్కొన్నారు. అంతేగాకుండా సంస్థాగత ఎన్నికల పదవులను ఎన్నికల ద్వారా భర్తీచేయకుండా వాటిని పంపిణీ చేస్తున్నారని కూడా మమత తనపై విరుచుకుపడ్డారన్నారు. ఆమె తీవ్ర ధోరణికి, చేసిన ఆరోపణలకు తాను విస్మయం చెందానని పేర్కొన్న ప్రణబ్ ఓ రాజీ మార్గాన్ని అప్పట్లో సూచించానన్నారు. దాన్ని కూడా మమత వ్యతిరేకించారని బహిరంగ ఎన్నికలకే డిమాండ్ చేశారని అన్నారు. ఆ డిమాండ్ చేసిన మమత ఉన్నపళంగా సమావేశం నుంచి వెళ్లిపోవడం తనను దిగ్భ్రాంతికి, అవమానానికి గురిచేసిందని ముఖర్జీ తన పుస్తకంలో రాశారు. ఆ ఎన్నికల్లో మమతా బెనర్జీ ఓడిపోయారని, పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా సొమేన్ మిత్రా ఎన్నికయ్యారని తెలిపారు. ఆ ఫలితం వెల్లడించిన సమయంలో ఆగ్రహంతో తన వద్దకు వచ్చిన మమత ‘ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా? నన్ను ఓడించాలన్న మీ కోరిక నెరవేరిందా?’ అంటూ ఆగ్రహంతో ప్రశ్నించారని కూడా ప్రణబ్ తన జ్ఞాపకాల సంపుటంలో గుర్తుచేసుకున్నారు. అయితే ‘మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు’ అని మమతను తాను బుజ్జగించేందుకు ప్రయత్నించానని, సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో తనకు ఎలాంటి పాత్రా లేదన్న విషయాన్ని ఆమె దృష్టికి తెచ్చానని పేర్కొన్నారు. వర్తమాన పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మమతా బెనర్జీ ఎదుగుదల అన్నది అత్యంత కీలకమైన పరిణామమని, ఆమె తన కెరీర్‌ను సొంత బలంతో, సొంత వ్యక్తిత్వంతో నిర్మించుకున్నారని తెలిపారు. నేడు మమత ముఖ్యమంత్రి కావడానికి కారణం కూడా తాను నిర్మించుకున్న బాటలోనే ఆమె ముందుకు సాగడమేనని కూడా ఆయన వివరించారు.