జాతీయ వార్తలు

‘మెర్సల్’కు రాజకీయ రంగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై/న్యూఢిల్లీ, అక్టోబర్ 21: తమిళ హీరో విజయ్ నటించిన ‘మెర్సల్’ చిత్రంపై బిజెపి నేతలు చేస్తున్న విమర్శలను కాంగ్రెస్ ఎండగట్టింది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, పార్టీ సీనియర్ నేత పి చిదంబరం బిజెపి నేతల తీరును తప్పుబట్టారు. జిఎస్‌టిని విమర్శిస్తూ మెర్సల్‌లో డైలాగులున్నాయని తమిళ బిజెపి నాయకులు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ ఇమేజ్‌ను దెబ్బతీసేలా ఉన్న ఆ డైలాగులు తొలగించాలన్న బిజెపి డిమాండ్‌ను కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది. ‘మిస్టర్ మోదీ, తమిళ సంస్కృతి, భాషను వ్యక్తీరిస్తూ మెర్సల్ తీశారు. తమిళ ప్రతిష్ఠను ప్రతిబింబించే మెర్సల్‌ను వ్యతిరేకించం, సినిమాల్లో జోక్యం సరైందికాదు’ అని రాహుల్ ట్వీట్ చేశారు. అలాగే తమిళనాడు ఆత్మగౌరవాన్ని డిమోనిటైజ్ చేయొద్దు అంటూ వ్యంగ్యోక్తులు విసిరాలు. ఎన్‌డిఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న జిఎస్‌టికి వ్యతిరేకంగా విజయ్ సినిమాలో డైలాగులున్నాయని కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ ఆరోపించిన మర్నాడే కాంగ్రెస్ విరుచుకుపడింది. రాహుల్ చేసిన ట్వీట్‌ను చిదంబరం రీ ట్వీట్ చేశారు. డైలాగులు తొలగించాలన్న బిజెపి నేతల డిమాండ్ సిగ్గుచేటు అది ఎంతమాత్రం తగదు అని చిదంబరం విమర్శించారు. నిర్మాతలకు అల్టిమేటం ఇవ్వడాన్ని కాంగ్రెస్ నేత తీవ్రంగా గర్హించారు. ‘మీ ప్రధానిని, ప్రభుత్వాన్ని పొగుడుతూ అవసరమైతే డాక్యుమెంటరీలు తీసుకోండి’ అని ఆయన చురకేశారు. అలాగే మెర్సల్‌కు పలువురు తమిళ సినీరంగ ప్రముఖులు మద్దతుగా నిలిచారు. హీరో విజయ్ నటనను కమల్‌హసన్ ప్రశంసించారు. సినిమాలో వివాదాస్పద డైలాగులున్నాయని, వాటిని తొగలించాలని చేస్తున్న డిమాండ్‌ను పట్టించుకోనవసరం లేదని ఆయన అన్నారు. ప్రజల సమస్యలను ఇతివృత్తంగా సినిమాలు తీయాల్సిన అవసరం ఎంతో ఉందని ఆయన తెలిపారు. అలాగే ఎఐఎస్‌ఎంకె చీఫ్, నటుడు శరత్ కమార్ తన ట్వీట్‌లో ‘సినిమాకు సెన్సార్‌బోర్డు ధ్రువప్రతం జారీ చేశాక ప్రశ్నించడం అర్ధరహితం. ఒకవేళ ప్రశ్నిస్తే ఇంకా సెన్సార్ బోర్డు ఎందుకు?’ అన్నారు. తమిళనాడు బిజెపినేత, పార్టీ జాతీయ కార్యదర్శి హెచ్ రాజా మాత్రం మెర్సల్‌లో మోదీని కించపరుస్తూ డైలాగులున్నాయని చెప్పారు. ఏదిఏమైనా తమిళనాడు మెర్సల్ విజయవిహారం చేస్తోంది. రాష్టవ్య్రాప్తంగా కాసుల వర్షం కురిపిస్తోంది.