జాతీయ వార్తలు

ఎల్‌ఓసి వద్ద పేట్రేగిన పాక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, అక్టోబర్ 21: జమ్మూకాశ్మీర్‌లోని బారముల్లా జిల్లాలో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వద్ద పాకిస్తాన్ జవాన్లు కాల్పులతో తెగబడ్డారు. కాల్పుల్లో ఒక ఆర్మీ పోర్టర్ చనిపోగా, బాలిక గాయపడింది. కమల్‌కోటే సెక్టార్‌లో ఈ ఘటన చోటుచేసుకుందని సైనిక ప్రతినిధి వెల్లడించారు. పాక్ సైనికులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారని ఆయన అన్నారు. ఎల్‌ఓసి వద్ద పాక్ తరచూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. అయితే పాక్ దళాలకు తాము కూడా ధీటుగా సమాధానం చెప్పామని, వారిని చెదరగొట్టినట్టు ఆయన తెలిపారు. కాగా పాక్ కాల్పుల్లో బాలిక గాయపడింది. తీవ్రంగా గాయపడ్డ ఆమెను మెరుగైన చికిత్స కోసం యూరి పట్టణంలో ఆసుపత్రికి తరలించారు. ఈ ఏడాది పాక్ కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనలు పెరిగాయి. ఈనెల 12న పాక్ కాల్పుల్లో ఒక ఆర్మీ జవాన్, ఒక పోర్టర్ మృతి చెందాడు. పూంచ్ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. అలాగే అక్టోబర్ 18న పూంచ్, రాజౌరి జిల్లాల్లో జనవాసాలపై పాక్ సైనికులు కాల్పులకు తెగబడ్డారు. కాల్పుల్లో రెండేళ్ల బాలికతోపాటు ఎనిమిది మంది పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం పాకిస్తాన్ దళాలు భారత భూ భాగాలను లక్ష్యంగా చేసుకుని 600 సార్లు కాల్పులకు దిగాయి. సెప్టెంబర్ 30వరకూ ఇవి జరిగాయి. ఈ ఘాతుక చర్యల్లో 8 మంది పౌరులు మృతి చెందారు. అలాగే 16 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. దశాబ్దకాలం తరువాత పాకిస్తాన్ జవాన్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇన్నిసార్లు ఉల్లంఘించడం ఇదే ప్రధమం. అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ, వాస్తవాధీన రేఖకు సంబంధించి ఇరుదేశాల మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం 2003 నవంబర్ నుంచి అమల్లోకి వచ్చింది. అప్పటినుంచీ పాక్ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది.