జాతీయ వార్తలు

అకారణంగా బాలికపై దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 21: పదహారేళ్ల బాలికను ఓ యువకుడు అకారణంగా ముక్కు మీద పదే పదే కొట్టిన సంఘటన ముంబయిలోని ఆదర్శనగర్‌లో చోటుచేసుకుంది. ఈ నెల 17 జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలికను కొట్టిన దృశ్యం సిసిటివిలో రికార్డు కావడంతో సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో అదే రోజు హాజరు పరిచారు. అయితే కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. ఈ సంఘటనకు సంబంధించిన కేసు చెంబూరులోని నెహ్రూనగర్ పోలీసులో కేస్టు రిజిష్టర్ అయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పదహారేళ్ల బాలిక సాయంత్రం 7 గంటల సమయంలో ఇంటికి వెళుతుండగా శ్రమజీవినగర్‌లోని ఎస్‌ఆర్‌ఏ బిల్డింగ్ వద్ద ఆటో పార్క్ చేసి ఉంది. అందులో ఉన్న కొంతమంది కుర్రాళ్లు గట్టిగా అరుస్తుండడంతో ఆ బాలిక మందలించింది. వెంటనే ఆటో దిగిన ఇమ్రాన్ షాహిద్ షేఖ్ బాలికపై దాడి చేసి ముక్కుమీద పదే పదే కొట్టాడు. అంతటితో బాలిక రక్తమోడుతూ కిందపడిపోయింది. ఆటోలోని మిగతావారు ఎవ్వరూ అతనిని అడ్డుకోలేదు. బాలికను వెంటనే ఆసుపత్రికి తరలించారు. నిందితునిపై సెక్షన్ 324, 326 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు.