జాతీయ వార్తలు

కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఉగ్రవాది హతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, అక్టోబర్ 22: కుప్వారా జిల్లాలో ఆదివారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక ఉగ్రవాది మరణించాడు. కూంబింగ్ ఆపరేషన్‌లో భాగంగా తనిఖీలు జరుపుతున్న భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఎదురుకాల్పులకు దారితీసింది. హంద్వారా ప్రాంతంలోని లాంగెట్ పట్టణంలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాది మరణించాడనీ, అతన్ని గుర్తించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారం అందుకున్న బలగాలు తనిఖీలు జరుపుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఎదురుకాల్పుల్లో ఉగ్రవాది మరణించింది వాస్తవమేనని రక్షణ శాఖ అధికార ప్రతినిధి కల్నల్ రాజేష్ కైలా ధ్రువీకరించారు. ఘటనా స్థలం నుంచి ఒక గ్రనేడ్, ఒక రైఫిల్, పాకిస్తాన్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కాగా, ఇటీవలి కాలంలో ఉగ్ర దాడులు పెరిగిన నేపథ్యంలో వారిని ఏరివేసేందుకు భద్రతా దళాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి. అందులో భాగంగానే ఆదివారం ఉదయం ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 155మంది ఉగ్రవాదులు మరణించగా, గత దశాబ్ద కాలంలో ఇదే అత్యధికం కావడం గమనార్హం. ఉగ్రవాదులను ఏరివేసేందుకు ‘ఆపరేషన్ హంట్ డౌన్’ పేరిట భద్రతా దళాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి.