జాతీయ వార్తలు

నీట్‌పై సస్పెన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 23: నీట్ నుండి రాష్ట్ర ప్రభుత్వాల బోర్డులను మినహాయించేందుకు కేంద్ర ప్రభుత్వం పంపించిన ఆర్డినెన్స్‌పై రాష్టప్రతి ఇంకా ఆమోద ముద్ర వేయలేదు. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జెపి నడ్డా సోమవారం ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ అదనపు సమాచారాన్ని అడిగినట్లు తెలిసింది. వైద్య ఆరోగ్య శాఖ అందజేసే అదనపు సమాచారంతో సంతృప్తి చెందే పక్షంలో ప్రణబ్ ముఖర్జీ సోమవారం రాత్రి ఆర్డినెన్స్‌పై సంతకం చేయవచ్చు. లేకపోతే ఆయన ఈనెల 27 తేదీనాడు చైనా పర్యటన ముగించుకుని వచ్చిన తరువాత మరోసారి సంప్రదింపులు జరిపే అవకాశం ఉంది. నీట్ ఆర్డినెన్స్‌ను ఆమోదించే అంశంలో ప్రణబ్ అన్ని కోణాల నుంచి ఆలోచిస్తున్నట్లు తెలిసింది. నీట్ వ్యవహారం ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిశీలనలో ఉంది. ఈ నేపథ్యంలో తాను ఆర్డినెన్స్‌పై తొందర పడి సంతకం చేస్తే ఏవైనా సమస్యలు వస్తాయా? అని ప్రణబ్ ముఖర్జీ ఆలోచిస్తున్నట్లు చెప్తున్నారు. నడ్డా సోమవారం మధ్యాహ్నం రాష్టప్రతిభవన్‌లో ప్రణబ్‌ని కలిసి నీట్ నుండి రాష్ట్ర ప్రభుత్వాల బోర్డులను మినహాయించేందుకు దారి తీసిన పరిస్థితులను వివరించారు. దాదాపు పధ్నాలుగు రాష్ట్రాలు నీట్‌ను వ్యతిరకించాయనీ, విద్యార్థులు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు నీట్‌కు సిద్ధంగా లేరని చెప్పినట్లు తెలిసింది. భాషా సమస్యతో పాటు రాష్ట్రాల సిలబస్ కూడా వేరుగా ఉన్నందున రాష్ట్రాల బోర్డులను మినహాయించాలని అనుకుంటున్నామని నడ్డా వివరించారు. తనకు వివరిస్తున్న విషయాలను కోర్టుకు వివరించారా? అని ప్రణబ్ నడ్డాను ఆడిగినట్లు తెలిసింది. ప్రభుత్వం చెప్తున్న కారణాలతో కోర్టు ఎందుకు అంగీకరించలేదని కూడా ప్రశ్నించినట్లు సమాచారం. ప్రణబ్ పలు ఆంశాలపై లోతుగా వివరణ అడగటంతో నడ్డా సరైన సమాధానాలు ఇవ్వకలేకపోయారు. రాష్టప్రతి అడిగిన అదనపు సమాచారాన్ని వైద్య, ఆరోగ్య శాఖ సోమవారం రాత్రి పొద్దుపోయిన తరువాత ఆయనకు పంపించినట్లు తెలిసింది. ఈ అదనపు సమాచారంతో సంతృప్తి చెందే పక్షంలో సోమవారం రాత్రి లేదా మంగళవారం ఉదయం చైనాకు బయలుదేరే ముందు ఆర్డినెన్స్‌పై రాష్టప్రతి సంతకం చేయవచ్చు. ఒకవేళ సంతృప్తి చెందని పక్షంలో చైనా పర్యటన ముగించుకుని ఈనెల 27న స్వదేశానికి తిరిగి వచ్చాకే ఆర్డినెన్స్ వ్యవహారాన్ని రాష్టప్రతి పరిశీలిస్తారంటున్నారు.
సంతకం చేయవచ్చు: నడ్డా
నీట్‌పై కేంద్ర మంత్రివర్గం పంపించిన ఆర్డినెన్స్‌పై రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ సంతకం చేస్తారనే ఆశాభావాన్ని నడ్డా వ్యక్తం చేశారు, రాష్టప్రతిని కలిసి తమ వాదన వినిపించిన అనంతరం నడ్డా బైట వేచి ఉన్న విలేకరులతో మాట్లాడుతూ ప్రణబ్ ముఖర్జీతో చర్చలు సంతృప్తికరంగా జరిగాయని ఒక ప్రశ్నకు బదులిచ్చారు.